हिन्दी | Epaper

US Fighter Jet Crash: కువైట్‌లో అమెరికా ఫైటర్ జెట్ కూల్చివేత

Anusha
US Fighter Jet Crash: American fighter jet shot down in Kuwait
US Fighter Jet Crash: American fighter jet shot down in Kuwait

US Fighter Jet Crash: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ కువైట్‌లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన ఎఫ్-15 (F-15) స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగగా, స్థానిక భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

Read Also: Khamenei Road: హైదరాబాద్‌లో ‘ఖమేనీ’ రోడ్ ఉందనే విషయం తెలుసా?

పైలట్ ప్రాణాలతో బయటపడటం ఊరట: స్వల్ప గాయాలు

ఈ ప్రమాదంలో పైలెట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు..ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా? లేక పొరపాటున జరిగిన ‘ఫ్రెండ్లీ ఫైర్’ వల్ల జరిగిందా? అనేది తెలియరాలేదు. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ దాడుల నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటనపై అమెరికా రక్షణ శాఖ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ప్రత్యేకతలు

అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఒక శక్తిమంతమైన మల్టీరోల్ యుద్ధ విమానం. ఇది గగనతలంలో శత్రు విమానాలతో పోరాడటంతో పాటు, భూమిపై ఉన్న లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రాత్రివేళల్లో, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సుదీర్ఘ శ్రేణి లక్ష్యాలపై దాడులు చేసేలా దీనిని రూపొందించారు.

ఇందులో ఇద్దరు వ్యక్తులు కూర్చునేలా టెన్డమ్ కాక్‌పిట్, అదనపు ఇంధనం కోసం కన్ఫార్మల్ ట్యాంకులు మరియు అత్యాధునిక టార్గెటింగ్ వ్యవస్థలు ఉంటాయి. ఇతర విమానాల రక్షణ అవసరం లేకుండానే శత్రువుల లోతైన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయి దాడులు చేయగలగడం ఈ ఫైటర్ జెట్ ప్రత్యేకత అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870