దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన భారీ క్షిపణి, డ్రోన్ దాడులతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో విమానాశ్రయం లోపలి భాగంలో కొంత నిర్మాణానికి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన కారణంగా నలుగురు విమానాశ్రయ ఉద్యోగులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ నుండి వెళ్లే, మరియు అక్కడికి వచ్చే విమానాలను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగవంతం చేశారు.
Uttar Pradesh Bus Accident: స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!
మరోవైపు, దుబాయ్ నగరానికి చిహ్నంగా నిలిచే ప్రపంచ ప్రసిద్ధ ఏడు నక్షత్రాల హోటల్ ‘బుర్జ్-అల్-అరబ్’పై కూడా ఇరాన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. ఆకాశంలోనే డ్రోన్లను కూల్చివేసినా, వాటి శిథిలాలు (debris) పడటంతో హోటల్ ముఖభాగంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దాడుల ప్రభావంతో దుబాయ్‌లోని ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయాయి. గల్ఫ్ దేశాలు అప్రమత్తమై తమ వైమానిక రక్షణ వ్యవస్థలను సిద్ధం చేశాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :