అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన మెరుపు దాడుల్లో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ దాడులతో ఇరాన్ అగ్రనేతను నిర్మూలించాలనే తమ ప్రధాన లక్ష్యాన్ని అమెరికా, ఇజ్రాయెల్ కూటమి పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఖమేనీ మరణంతో ఇరాన్ రాజకీయాల్లో శూన్యత ఏర్పడటమే కాకుండా, ఆ దేశ భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామం మధ్యప్రాచ్య రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Uttar Pradesh Bus Accident: స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!
అయితే, ఈ సైనిక చర్యల వల్ల ఇరాన్లో భారీగా ప్రాణనష్టం వాటిల్లుతోంది. ఖమేనీని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో వందలాది మంది అమాయకులు బలికావడం తీవ్ర విషాదానికి దారితీసింది. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం, ఈ దాడుల్లో 200 మందికి పైగా మరణించగా, 700 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, మినాబ్ ప్రాంతంలోని ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో 85 మంది బాలికలు ప్రాణాలు కోల్పోవడం. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది, యుద్ధంలో సైనిక లక్ష్యాల పేరుతో పాఠశాలలను కూడా వదలకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :