Iran IRGC New Commander: ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భారీ వైమానిక దాడులతో ఇరాన్ అతలాకుతలమవుతున్న వేళ, ఆ దేశ సుప్రీం నాయకత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ గడ్డపై అత్యంత శక్తిమంతమైన సైనిక విభాగంగా గుర్తింపు పొందిన ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) కు కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌ను నియమించింది. సీనియర్ అధికారి బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వాహిదీని ఈ అత్యున్నత పదవిలో నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Read Also: Israel Iran War: మధ్యప్రాచ్యంలో క్షిపణుల విధ్వంసం

అహ్మద్ వాహిదీ: యుద్ధ తంత్రంలో నిపుణుడు
శనివారం జరిగిన దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్ మహ్మద్ పాక్పూర్ మరణించినట్లు వార్తలు వచ్చిన గంటల వ్యవధిలోనే ఈ నియామకం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.అహ్మద్ వాహిదీకి సైన్యంలోనూ, ప్రభుత్వంలోనూ విశేష అనుభవం ఉంది. గతంలో ఆయన ఇరాన్ రక్షణ మంత్రిగా, అంతర్గత వ్యవహారాల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో, వ్యూహరచనలో నిపుణుడైన వాహిదీ నియామకం ద్వారా సైనిక బలగాల్లో ఐక్యతను తీసుకురావాలని ఇరాన్ ప్రభుత్వం భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: