సౌదీ అరేబియాలోని మదీనాలో గత ఏడాది నవంబర్ 17న జరిగిన దురదృష్టకర బస్సు ప్రమాదం తెలంగాణలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 44 మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం, మృతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో మృతుల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారపు చెక్కులను అందజేశారు. అలాగే, ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
Iran Defense Minister: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి?
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సాధారణంగా దేశ సరిహద్దులు దాటి జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించవని, కానీ బాధితుల కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మరియు వారి కష్టాలను పరిగణనలోకి తీసుకుని, మానవీయ కోణంలో ఈ సహాయాన్ని ప్రకటించినట్లు స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో ఇళ్లకు పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఈ పరిహారం కొంతవరకు ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.