Iran Attack: పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దళాలు జరుపుతున్న వైమానిక దాడులు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో తాజాగా ఇరాన్‌లోని మినాబ్ నగరంలో జరిగిన ఒక ఘోర వైమానిక దాడి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఒక పాఠశాల లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.
Read Also: Air India: ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియా విమానాల రద్దు

ఈ భయంకరమైన దాడిలో సుమారు 36 మంది విద్యార్థులు అక్కడికక్కడే మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. విద్యాసంస్థపై జరిగిన ఈ దాడిలో చిన్నారులు బలికావడం అత్యంత విషాదకరంగా మారింది. మినాబ్ ప్రాంతంలోని పాఠశాల భవనం ఈ క్షిపణి దాడుల ధాటికి పూర్తిగా ధ్వంసమైంది. ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ వాదిస్తున్నప్పటికీ, జనసమ్మర్థం ఉన్న పాఠశాలలు, జనావాసాలపై దాడులు జరగడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనతో ఇరాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమాయక విద్యార్థుల మరణానికి ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. మరోవైపు, ఈ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో అభద్రతా భావం పెరుగుతోంది. అంతర్జాతీయ సమాజం మరియు మానవ హక్కుల సంఘాలు ఈ ఘోర కలికలంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని కోరుతున్నాయి. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఈ ప్రతీకార దాడులు ఏ క్షణమైనా పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: