Vetlapalem Firecracker Accident: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన భయానక పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 20 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.
Read Also: Kakinada Fire Accident: బాణాసంచా కేంద్రంలో పేలుడు.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు
Vetlapalem Firecracker Accident: 50 మంది పనిచేస్తుండగా ప్రమాదం
ఘటన జరిగిన సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో సుమారు 50 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే, భవనం శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతులంతా సామర్లకోట, వేట్లపాలెం, హుస్సేన్‌పురం గ్రామాలకు చెందిన నిరుపేద కూలీలుగా గుర్తించారు.
అధికారుల సమీక్ష
ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్ చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తుండగా, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్సుల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దుర్ఘటనతో సామర్లకోట పరిసర గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ వారు ఏమయ్యారో తెలియక కుటుంబ సభ్యులు ఘటనా స్థలం వద్ద కన్నీరుమున్నీరవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: