Odisha Crime: ఒడిశాలోని పారాదీప్‌లో ఈనెల 22న అర్ధరాత్రి జరిగిన యువతి మృతి కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా, హత్యగా తేలింది. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
Read Also: India EUFTA: ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాపై కీలక ఒప్పందం

ప్రియుడే కాలయముడు: విచారణలో షాకింగ్ నిజాలు
బాధితురాలి బాయ్ ఫ్రెండ్ సోమ్ నాథ్ ఒఝా, శుభం కుమార్ లు ఆమెపై అత్యాచారం చేసి, నాలుగో అంతస్తు బిల్డింగ్ పై నుంచి తోసి చంపినట్లు విచారణలో తేలింది. పోస్ట్ మార్టమ్ రిపోర్టులో ఆమెపై రెండుసార్లు అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. నిందితుల మొబైల్ ఫోన్ల నుంచి అడల్ట్ వీడియో కంటెంట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: