Srinivasa Mangapuram Movie: కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు మరోసారి వెండితెరపై తన గంభీరమైన నటనతో అలరించబోతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘శ్రీనివాస మంగపురం’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా చిత్రబృందం ఈ సినిమా నుంచి మోహన్ బాబు పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే మోహన్ బాబు తనదైన శైలిలో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెప్పించబోతున్నారని స్పష్టమవుతోంది.
Read Also: Decoit Movie Release Date: ‘డెకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ ఖరారు
వెంకటప్పయ్య నాయుడుగా పవర్ ఫుల్ లుక్
ఈ చిత్రంలో మోహన్ బాబు “వెంకటప్పయ్య నాయుడు” అనే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో ఆయన లుక్ ఎంతో రాజసంగా, గంభీరంగా ఉంది. కళ్ళలో గర్వం, ముఖంలో ధైర్యం కలగలిసిన ఒక విలక్షణమైన వ్యక్తిత్వమున్న పాత్రలో ఆయన కనిపించబోతున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘మహాసముద్రం’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న దర్శకుడు అజయ్ భూపతి, మోహన్ బాబును ఒక సరికొత్త కోణంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని వెండితెరకి పరిచయం కాబోతుండగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాశా థడాని హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాతలు అశ్వినీదత్, జెమిని కిరణ్ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: