అమరావతే భవిష్యత్తు.. దేశానికి గర్వకారణం
- పవన్ నాకు జీవితాంతం పెద్దన్నే
ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో మంత్రి నారా లోకేష్
Nara Lokesh: విజయవాడ : అభివృద్ధి చెందిన రాష్ట్రాలే దేశాన్ని బలోపేతం చేస్తా యని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 2047 నాటికి ఆంద్ర ప్రదేశను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ముంబైలో ఒక న్యూస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగిన ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జర్నలిస్ట్ మేఘా ప్రసాద్లో జరిగిన ఫైర్ సైడ్ చాట్లో ఆయన ఏపీ అభివృద్ధి ప్రణాళికలు, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకు న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మాట ఇస్తే అది జరిగి తీరుతుందని, ఆయన నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగ మించడమే తన ముందున్న కర్తవ్యమని లోకేశ్ అన్నారు.
Read Also:Yerraguntla: యర్రగుంట్లలో రూ.2.52 కోట్ల నగదు సీజ్

తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, సవాళ్లను ఇష్టంగా స్వీకరిస్తామని తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ తనకు బిగ్ బ్రదర్ అని, జీవి తాంతం తనకు పెద్దన్నేనని ఆయన వ్యాఖ్యానించారు. మేము కేవలం ఒక నగరాన్ని మాత్రమే నిర్మించడం లేదు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీ కరణ అనే నినాదాన్ని బలంగా నమ్ముతాం. విశాఖ పట్నం, అమరావతి, తిరుపతిలను ఆర్థిక రీజియన్లుగా అభివృద్ధి చేస్తూ, వాటి పరిధిలో పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నాం,” అని లోకేశ్ వివరించారు. క్లస్టర్ విధానాన్ని వివరిస్తూ. “ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్త యారీ రంగంలో ఫాక్స్ కాన్ లాంటి ఒక కంపెనీని తీసుకురావడమే కాకుండా, ఐఫోన్ అసెంబుల్కు అవస “రమైన అన్ని విడిభాగాల తయారీదారులను ఒకేచోటకు తీసుకురావడమే మా వ్యూహం. దీని ద్వారా అభి వృద్ధిని రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకరించడం సుసాధ్యమ వుతుంది” అని తెలిపారు. ఫార్చూన్ 500 కంపెనీలను ఆకర్షించేందుకు ఎకరా భూమిని 99 పైసలకే ఇస్తున్నా మని, తాము ఇచ్చే భూమి విలువ కన్నా ఆ కంపెనీల రాకతో ఏర్పడే ఆర్ధిక కార్యకలాపాలు, ఉద్యోగ కల్పన ఎన్నో రెట్లు అధికమని లోకేశ్ తెలిపారు. కాగ్నిజెంట్ కంపెనీని ఉదాహరణగా చూపుతూ, “విశాఖలో ఆ కంపెనీ ఏర్పాటుతో 25,000 ఉద్యోగాలు వస్తాయి. ఏటా రూ.1500 కోట్ల ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయి. భూమి విలువ కన్నా రాష్ట్రానికి వచ్చే ఈ ప్రయోజనం ఎంతో పెద్దది” అని స్పష్టం చేశారు.
నమో సర్కార్ తో పెట్టుబడుల వెల్లువ: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని లోకేష్ పేర్కొన్నారు. “ఒకటి, అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు… రెండవది, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కేవలం 17 నెలల్లోనే దేశంలోనే అతిపెద్దదైన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు అన్ని అనుమతులు ఇచ్చాం. మార్చి మూడోవారంలో దానికి శంకుస్థాపన చేయబోతున్నాం. మూడవది, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ఢిల్లీలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం నాయుడు కలయికను నేను నమో (నాయుడుమోదీ) అని పిలుస్తాను. ఈ నాయకత్వం వల్లే భారతదేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి వచ్చాయి” అని ఆయన గణాంకాలతో వివరించారు.
అమరావతే భవిష్యత్తు.. దేశానికి గర్వకారణం: అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని, ఇది భవిష్యత్తుకు చిరునామా అని లోకేశ్ అన్నారు. “పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఏపీకి రాకపోతే, భవిష్యత్తులో ఎందుకు రాలేకపోయామని బాధపడతారు. ప్రతి వంద రోజులకు ఒకసారి అమరావతికి వచ్చి చూడండి. అక్కడ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మీకే తెలుస్తుంది. భారతదేశం గర్వించేలా రాజధానిని నిర్మిస్తున్నాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడామని, ప్రస్తుతం అది లాభాల బాటలో పయనిస్తోందని తెలిపారు. తాము సమిష్టి సమాఖ్య స్ఫూర్తిని విశ్వసిస్తామని, డేటా సెంటర్ పాలసీ రూపకల్పనలో కేంద్రంతో కలిసి పనిచేసి దేశవ్యాప్తంగా ప్రయోజనం చేకూర్చే ఫ్రేమ్ వర్ను రూపొందించామని లోకేశ్ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: