Adulterated Milk Telangana: రాష్ట్రంలో కృత్రిమ, కల్తీ పాలు టెర్రర్ పుట్టిస్తున్నాయి. తెలంగాణలో పాల ఉత్పత్తి స్తంభించిపోవడంతో పాల కొరత ఏర్పడింది. దీంతో కల్తీ పాలకు అవకాశం ఏర్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పశు సంపద (ఆవులు, గేదెలు) తగ్గడం, గ్రామీణ ప్రాంతాల నుండి పాల సేకరణ తగ్గిపోవడం దీనికి ప్రధాన కారణాలు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం సబ్సిడీపై పశువులను పంపిణీ చేసే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆవుల సంఖ్య 2019లో 42,32,383 ఉండగా, ఇప్పుడు 27.48 శాతం మేర 30,69,524కు తగ్గింది.
Read Also: Telangana: అసెంబ్లీలో స్పీకర్ను కలిసిన మల్లు భట్టివిక్రమార్క

తెలంగాణలో రోజుకి సుమారు 26 లక్షల లీటర్ల పాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న పాలు కేవలం 4 లక్షల లీటర్ల వరకు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఇది రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు సరిపడే స్థాయిలో లేదు. పాడిపశువుల సంఖ్య తగ్గడం వల్ల పాల ఉత్పత్తిలో గణనీయమైన కోత వచ్చింది. ఇప్పటికే పాడిరైతులు పోసే పాలు రోజుకి కేవలం 50 వేల లీటర్ల వరకు తగ్గిపోవడం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.
పాలకు కొరత ఏర్పడి కల్తీకి దారి
ఈ నేపధ్యంలో పాలకు కొరత ఏర్పడి కల్తీకి దారి తీస్తోంది. యూరియా, రసాయనా లతో పాలకల్తీ జరుగుతుండగా, పాల ఉత్పత్తి పెంచేందుకు పశువులకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇస్తూ వినియోగదారుల ప్రాణాలు, ఆరోగ్యాలతో అక్రమార్జన పరులు ఆటలాడుతున్నారు. ఎపిలోని రాజమండ్రిలో కల్తీపాలు తాగి దాదాపు ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో పాల సేకరణ, పాల తయారీ, డెయిరీలను పరిశీలిస్తున్న అధికారులకు షాకింగ్ కలిగించే దారుణ కల్తీలు బయటపడుతున్నాయి. ఈ నేపధ్యంలో షాద్నగర్లో రసాయనాలతో తయారుచేసిన పాలను మిక్స్ చేసి అమ్ముతున్న విషయం గుర్తించారు. కాగా రాష్ట్రంలో గతం నుండి కల్తీ పాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.
అయితే వీటిపై అధికారులు దృష్టిసారించక పోవడంతో కల్తీ పాల వ్యాపారం యదేచ్ఛగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో యూరియా, డిటర్జెంట్లు, వంటనూనె, రసాయనాలు, కొన్ని అసలు పాలతో కృత్రిమ పాలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ ఫ్యాట్ వచ్చే విడిపాలు మంచి వని అనుకుంటే, వాటిలో వెన్న తీసి డాల్డా కలుపుతున్నారు. కొంతమంది పాలలో నీళ్లు, యూరియా కలిపి మిల్క్ క్వాంటిటీని పెంచుతారు. దీనివల్ల కల్తీ పాలు చిక్కగా, తెల్లగా కనిపస్తాయి, అసలు కల్తీ జరిగిందనే విషయమే తెలియదు. పాలలో డిటర్జెంట్ మిక్స్ చేస్తున్నారు. దీంతో పాలు నురగ వచ్చి చిక్కగా కనిపిస్తాయి. ఇవి తాగితే స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: