Constable Divya: వికారాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని గంగారాం సాయి బాబా కాలనీలో నివాసం ఉంటున్న బలిజ దివ్య (27), శనివారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. చిన్న వయసులోనే పోలీస్ శాఖలో చేరుతూ, విధి నిర్వహణలో చురుగ్గా ఉండే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తోటి సిబ్బందిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
Read Also: Saudi Arabia Crime: రియాద్‌లో రాజమండ్రి దంపతుల హత్య
ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా
వివరాల్లోకి వెళితే.. బలిజ దివ్య కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ధరూర్ సీఐ కార్యాలయానికి అటాచ్‌గా పనిచేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఆమె ఉరివేసుకుని ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వికారాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాల వల్ల ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా? లేక విధి నిర్వహణలో ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: