हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

Kalvakuntla Kavitha: నేను కాదు.. మీ అహంకారమే ఓటమికి కారణం

Tejaswini Y
Kalvakuntla Kavitha: నేను కాదు.. మీ అహంకారమే ఓటమికి కారణం

Kalvakuntla Kavitha: వాస్తవాలు ఒప్పుకో అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు క్లీన్ చిట్ ఇస్తూ వచ్చిన తీర్పుపై కేటీఆర్ స్పందించారు. మద్యం కుంభకోణం పేరుతో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేశారని, తెలంగాణలో ఆ కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కవితకు అనుకూలంగా వచ్చిన తీర్పుతో న్యాయం జరిగిందని అన్నారు.

Read Also: Telangana: అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసిన మల్లు భట్టివిక్రమార్క

Kalvakuntla Kavitha: Not me.. Your arrogance is the reason for the defeat
Kalvakuntla Kavitha: Not me.. Your arrogance is the reason for the defeat

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం

మద్యం కుంభకోణం కారణంగానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టును చూశానని, తనపై పెట్టిన కేసు వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న ట్లుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణమా సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రజలకు ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, అభ్యర్థులను మార్చకుండా దోపిడీదారులకే తిరిగి టిక్కెట్లు ఇవ్వడం, అన్నింటికంటే ముఖ్యంగా మీ అహంకార ధోరణి ఓటమికి కారణమని కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఈరోజు కోర్టు తీర్పును మీకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడటం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఇప్పటికైనా మీరు ప్రజల తీర్పును గౌరవించాలని కేటీఆర్ కు సూచించారు. తాను రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత చాలా సరైజ్లు ఉంటాయని తెలంగాణ జాగృ తి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు నెలల్లో కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు తెలిపారు. రాజకీయం చేయాలంటే ధైర్యం ఉండాలని, ఓటమిని సైతం అంగీకరించే మనస్తత్వం లేదన్నారు.

బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరమే

ఢిల్లీ మద్యం పాలసీ కేసు ఇంకా ఉందని బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరమే అన్నారు. తనను ఐదు నెలలపాటు జైల్లో పెట్టి క్షోభకు గురిచేశారని అన్నారు. తనకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఎవరూ పెద్దగా తెలియదని వెల్లడించారు. సంజయ్ సింగ్ ఎంపీ కాబట్టి పరిచయం ఉండేదని అన్నారు. మద్యం కేసులో క్లీన్ చిట్ వచ్చాక మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు తనను అరెస్టు చేసినప్పుడు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. సమస్యలు ఉన్నప్పుడు తాను షో చేయడానికి ఎప్పుడూ వెళ్లనని కవిత తెలిపారు.

కుమ్మెర జాతర ఘటనపై తాను ఆ రోజే ఎస్పీతో మాట్లాడానని వెల్లడించారు. నింది తులకు తగిన శిక్ష పడాలని బాధిత కుటుంబం, తాము కోరు కుంటున్నామని అన్నారు. సమాజం పట్ల మన కంటే లక్ష రెట్ల అవగాహన మావో యిస్టు అగ్రనే తలకు ఉందని కవిత పేర్కొన్నారు. నేను సమా జంలో ఉండి పోరాడితే, వారు అడవుల్లో ఉంటూ సమాజం కోసం పోరాటం చేస్తు న్నారని ప్రశంసించారు. మావోయిస్టులు లొంగిపోయి సిద్ధాంతాన్ని బ్రతికించారని అన్నారు. గాంధీ సరోవర్రాజెక్టు కింద గాంధీ విగ్రహం పెట్టడాన్ని తప్పుపట్టదలుచుకోలేదని కవిత తెలిపారు. కానీ అన్ని ఇళ్లు కూలగొట్టడం ఎందుకని ప్రశ్నించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870