Will jacks innings : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. యువ ఆటగాళ్లు విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ ఆఖరి ఓవర్లలో అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తిప్పేశారు.
160 పరుగుల లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన ఇంగ్లండ్ మధ్య ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే చివరి ఓవర్లలో విల్ జాక్స్ (22 బంతుల్లో 41*), రెహాన్ అహ్మద్ (9 బంతుల్లో 24*) మెరుపు ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరమైన సమయంలో తొలి మూడు బంతుల్లోనే లక్ష్యాన్ని చేరుకుని జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.
Read Also: Delhi Liquor: మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్ కన్నీటిపర్యంతం

మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఓటమిపై స్పందిస్తూ, ఇంగ్లండ్ యువ ఆటగాళ్లను ప్రశంసించాడు. “ఇది చాలా హోరాహోరీ పోరు. జాక్స్, రెహాన్ చివరి ఓవర్లలో అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను మా చేతుల్లోంచి లాగేశారు. మేము కీలక సమయాల్లో ఒత్తిడికి లోనయ్యాం. ఇంకొంచెం పరుగులు ఎక్కువగా చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో” అని అన్నాడు.
ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడిలో యువ ఆటగాళ్లు చూపిన ధైర్యాన్ని కొనియాడాడు. అదే సమయంలో జోస్ బట్లర్‌పై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ, “బట్లర్ మా జట్టుకు కీలక ఆటగాడు. ప్రతి గొప్ప ఆటగాడికి ఇలాంటి దశలు వస్తాయి. అతను త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడు” అని విశ్వాసం వ్యక్తం చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: