AP group 1 case : ఏపీ గ్రూప్-1 (2018) మెయిన్స్ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను తామే పర్యవేక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. కేసు తార్కిక ముగింపుకు చేరుకునే వరకు దీనికి సంబంధించిన పిటిషన్లు తమ పరిధిలోనే కొనసాగుతాయని ధర్మాసనం తెలిపింది.
జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మలతో కూడిన బెంచ్ విచారణ సందర్భంగా, సిట్ పారదర్శకంగా మరియు నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహిస్తుందని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లపై కోర్టు విచారణ చేపట్టింది.
Read Also: Vishnu Vinyasam Movie Review: శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ చేరినట్టేనా?

కోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేశారా (AP group 1 case) అని ప్రశ్నించగా, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఉత్తర్వుల అమలుకు సంబంధించిన వివరాలతో మెమో కూడా సమర్పించినట్లు పేర్కొన్నారు.
అయితే, ఈ కేసులో ఎంపికైన అధికారులను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలన్న కోర్టు ఉత్తర్వులను సమయానికి అమలు చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. అభ్యర్థి గొర్ల సుజాత దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: