PM-KUSUM Scheme: రైతుల సాగు ఖర్చును తగ్గించి, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ (PM-KUSUM) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పొలాల్లో సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేసుకునే రైతులకు ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం అందిస్తోంది. సోలార్ పంపు సెట్ మొత్తం ఖర్చులో 60 శాతం మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుంది. మరో 30 శాతం మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. అంటే రైతు కేవలం 10 శాతం పెట్టుబడి పెడితే సరిపోతుంది.
Read Also: Delhi Liquor: మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్ కన్నీటిపర్యంతం
ఈ పంపుసెట్ల ద్వారా మిగులు విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించి రైతులు లక్షల్లో ఆదాయం పొందవచ్చు. పంట సాగుకు ఉపయోగపడటమే కాకుండా రైతులు వీటి ద్వారా ఏళ్ల పాటు ఆదాయం పొందవచ్చు. 2026 మార్చి నాటికి 34,800 మెగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
అర్హతలు..?
-రైతులు -రైతు సంఘాలు -సహకార సంఘాలు -నీటి వినియోగదారుల సంఘాలు -గ్రామ పంచాయతీలు

దరఖాస్తు ఎలా అంటే..?
-పీఎం కుసుమ్ అధికారిక వెబ్ సైట్‌కు వెళ్లండి -రిజిస్ట్రేషన్ ఫారంపై క్లిక్ చేయండి -అన్ని వివరాలను పూర్తి చేయండి -డిక్లరేషన్ బాక్స్‌ను క్లిక్ చేయండి -సబ్‌మిట్‌పై క్లిక్ చేయండి -ఆ తర్వాత లాగిన్‌పై క్లిక్ చేయండి -అప్లికేషన్ పూర్తి చేసి డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయండి
ఈ డాక్యుమెంట్స్ అవసరం
ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ బుక్, మొబైల్ నెంబర్, పాస్ పోర్ట్ సైజు ఫొటో, డిక్లరేషన్ ఫామ్, బ్యాంక్ పాస్ బుక్, ల్యాండ్ డాక్యుమెంట్
ఆదాయం లక్షల్లోనే
ఉదాహరణకు ఒక మెగావాట్ కెపాసిటీ సోలార్ ప్లాంట్ రైతులు ఏర్పాటు చేసుకుంటే.. దాని నుంచి రోజుకు దాదాపు 4,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్‌ను రాష్ట్రంలోని డిస్కమ్‌లు 25 ఏళ్ల పాటు కొనుగోలు చేస్తాయి. ఇందుకు ముందుగానే రైతులతో డిస్కంలు ఒప్పందం చేసుకుంటాయి. ఒక యూనిట్‌కు రూ. 3.13 చొప్పున రైతులు పొందవ్చచు. అంటే రోజుకు రూ.14 వేల వరకు ఆదాయం పొందవచ్చు. ఇలా 25 ఏళ్ల పాటు అంటే లక్షల్లో ఆదాయం వస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: