Nara Lokesh Mumbai Visit: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన ముంబై పర్యటనలో భాగంగా బాలీవుడ్ దిగ్గజ నటుడు సంజయ్ దత్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ఇరువురూ ఆసక్తికర చర్చలు జరిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ను సినిమా షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చడమే లక్ష్యంగా ఈ భేటీ సాగింది.
Read Also: Mahesh Babu: సూపర్ స్టార్ గ్లామర్‌కు ఫిదా అయిన క్రికెటర్ శివం దూబే
ఏపీలో కొత్త ఫిలిం సిటీ ప్రతిపాదన
రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త ‘ఫిలిం సిటీ’ని ఏర్పాటు చేసే అవకాశాలపై సంజయ్ దత్‌తో లోకేశ్ చర్చించారు. ఏపీలో ఉన్న సహజ సిద్ధమైన లోకేషన్లు, షూటింగ్‌లకు అనుకూలమైన వాతావరణాన్ని ఆయన వివరించారు. దీనివల్ల స్థానిక కళాకారులకు ఉపాధి దొరకడమే కాకుండా, రాష్ట్ర పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
సింగిల్ విండో విధానంపై దృష్టి
సినిమా షూటింగ్‌ల కోసం నిర్మాతలు ఎదుర్కొనే అనుమతుల సమస్యను పరిష్కరించేందుకు ‘సింగిల్ విండో’ విధానాన్ని తీసుకురానున్నట్లు లోకేశ్ వెల్లడించారు. ఈ విధానం ద్వారా వేగంగా అనుమతులు మంజూరు చేయడం వల్ల నిర్మాతల సమయం, ఖర్చు ఆదా అవుతాయని ఆయన పేర్కొన్నారు.

ఏపీని దేశంలోనే అత్యుత్తమ షూటింగ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు.పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణలో భాగంగానే వినోద రంగాన్ని కూడా ఏపీలో బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే లోకేశ్ బాలీవుడ్ ప్రముఖులను కలుస్తూ రాష్ట్రంలోని వనరులను, అవకాశాలను వారికి వివరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: