हिन्दी | Epaper

Kerala Story sequel : కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్, స్టే రద్దు

Sai Kiran
Kerala Story sequel : కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్, స్టే రద్దు

Kerala Story sequel : The Kerala Story 2 విడుదలపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఈ సినిమాపై కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ విధించిన స్టేను డివిజన్ బెంచ్ ఎత్తివేయడంతో చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది.

ఇటీవల సింగిల్ బెంచ్ ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నిర్ణయాన్ని ప్రశ్నించింది. చిత్రాన్ని మళ్లీ సమీక్షించాలని ఆదేశిస్తూ 15 రోజుల పాటు విడుదలపై తాత్కాలిక స్టే విధించింది. దీంతో ఫిబ్రవరి 27న విడుదల కావాల్సిన సినిమా నిలిచిపోయింది.

ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ చిత్ర నిర్మాతలు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ పీవీ బాలకృష్ణన్‌లతో కూడిన బెంచ్ ఇరువర్గాల వాదనలు సుదీర్ఘంగా విన్న అనంతరం సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను రద్దు చేసింది.

Read Also: Telangana: టీచర్ల పనితీరు ఆధారంగా ప్రమోషన్లు

Kerala Story sequel
Kerala Story sequel

2023లో సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీ చిత్రానికి ఇది సీక్వెల్. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. ఉల్కా గుప్త, అదితి బాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా కథను రూపొందించినట్లు చిత్రబృందం తెలిపింది.

డివిజన్ బెంచ్ తీర్పుతో సినిమా విడుదలకు ఎదురైన అడ్డంకులు తొలగిపోవడంతో, త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870