
Chain Snatching: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో పట్టపగలే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కిష్టారెడ్డి నగర్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కిరాణా షాపు యజమానిని బురిడీ కొట్టించి, కళ్లముందే బంగారు (Gold) గొలుసు లాకెళ్లిన దుండగులు.
Read Also: TG 10th Class Pass Marks: విద్యార్థులకు అలర్ట్.. 45 మార్కులు వస్తేనే పాస్!
సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు
జడ్చర్లలోని కిష్టారెడ్డి నగర్ కాలనీలో ఉన్న ఒక కిరాణా షాపు వద్దకు ముగ్గురు వ్యక్తులు బైక్పై వచ్చారు. ఇద్దరు వ్యక్తులు బైక్ స్టార్ట్ చేసి సిద్ధంగా ఉంచగా, మరో వ్యక్తి కస్టమర్లా నటించి షాపు వద్దకు వెళ్లాడు. తాగడానికి వాటర్ బాటిల్ కావాలని అడిగి, షాపులోని మహిళ అటూ ఇటూ చూస్తున్న అదును చూసి ఆమె మెడలోని బంగారు గొలుసును ఒక్కసారిగా లాగేసి బైక్పై పరారయ్యాడు.
ఈ చైన్ స్నాచింగ్ ఘటన అంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దుండగులు బైక్పై వచ్చిన తీరు, గొలుసు లాక్కొని పారిపోయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: