हिन्दी | Epaper

E voting: ఇ ఓటింగ్.. ఒక విప్లవాత్మక అడుగు

Sudha
E voting: ఇ ఓటింగ్.. ఒక విప్లవాత్మక అడుగు

భారతీయ ప్రజాస్వామ్యంలో కీలక ఘట్టమైన ఎన్నికల ప్రక్రియను డిజిటల్ యుగానికి అనుగుణంగా మార్చ డంలో బీహార్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక చారిత్రాత్మక ముందడుగు వేసింది. ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026లో కృత్రిమ మేధ ఆధారిత ఇ ఓటింగ్ (E voting)వ్యవస్థను ప్రదర్శించి దేశవ్యాప్త చర్చనీయాంశం చేసిన ఈ మోడల్, ఇప్పటికే మున్సిపల్ ఉపఎన్నికల్లో విజయవంతంగా అమలు చేసి, రాబోయే శాసనసభ ఎన్నికలకు విస్తరించాలని సిద్ధమవు తోంది. ఇది విజయవంతమైతే ఇతర రాష్ట్రాలు కూడా ఈ మార్గం అనుసరించడం ఖాయం. ఇది కేవలం సాంకేతిక ఆవిష్కరణ కాదు, ప్రజాస్వామ్యాన్ని మరింత సమగ్రం, సమానం, సులభం చేసే సామాజిక న్యాయం. ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో ఓటు వేయాలనే కోరిక ఉన్నప్పటికీ అనివార్య పరిస్థితులు అడ్డుకుంటున్నాయి. వలస కార్మికులు, దూరప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు, వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు – ఈ వర్గాలు పోలింగ్ బూత్లకు చేరుకోవడం కష్టం. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గుతోంది. భౌతిక పరిమితులు ప్రజాస్వామ్యానికి ఆటంకం కాకూడదని బీహార్ ఎన్నికల సంఘం గుర్తించి, స్మార్ట్ఫోన్ఆధారిత ప్రత్యేక యాప్ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సౌలభ్యం కల్పించింది. ఇది డిజిటల్ ఇండియా దృష్టికోణానికి పూర్తిగా అనుగుణమైన అడుగు. ఓటు హక్కు ను జీవన వాస్తవాలకు అనుగుణంగా మార్చడం ద్వారా ప్రతి పౌరుడి భాగస్వామ్యాన్ని నిజం చేస్తుంది. ఈ వ్యవస్థ ఆధార్ లింక్కు బదులు ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు (ఎపిక్) డేటాబేస్ను ఉపయోగించడం గోప్యతను కాపాడుతుంది. ఫేషియల్ రికగ్నిషన్, లైవ్నెస్ డిటెక్షన్, డివైస్లెవల్ వెరిఫికేషన్, బ్లాక్చెయిన్ ఆధారిత ఎన్క్రిప్షన్ – ఈ బహుళస్థాయి రక్షణ వ్యవస్థ నకిలీ ఓట్లకు అవకాశం ఇవ్వదు. ప్రతి ఓటు ఎస్క్రిప్ట్ అయి బ్లాక్ చెయిన్లో రికార్డ్ అవుతుంది. కాబట్టి దాన్ని మార్చడం లేదా తొలగించడం అసాధ్యం. స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఈవీఎం మాదిరిగా ఓట్ల లెక్కింపును స్వయం చాలకంగా చేస్తాయి. ఎన్నికల అధికారి డిజిటల్ సిగ్నేచర్, టూఫ్యాక్టర్ అథెంటికేషన్, హ్యాష్ వెరిఫికేషన్ లేకుండా డీక్రిప్షన్ సాధ్యం కాదు. ఏఐ ఆధారిత ఓసీ ఆర్ లెక్కింపు వ్యవస్థ మానవ తప్పిదాలను తగ్గించి, ఫలి తాలను సత్వరం వెలువరిస్తుంది. వీడియో రికార్డులు, ఆడిట్ లాగ్స్ ద్వారా ఏ దశలోనైనా ధ్రువీకరణ సాధ్యం. ఇలాంటి బహుళ రక్షణలు ఇ ఓటింగు (E voting)నమ్మదగినదిగా, పారదర్శ కంగా చేస్తాయి.

Read Also : Nirmala Sitharaman: బలవంతంగా బీమా పాలసీలు రుద్దితే కఠిన చర్యలు!

E voting
E voting

అయితే, ఏ వినూత్న వ్యవస్థ అయినా సవాళ్లు లేకుండా ఉండదు. డిజిటల్ లిటరసీ తక్కువగా ఉన్న బీహార్లో వృద్ధులు, తొలిసారి ఓటు వేసేవారికి యాప్ వినియోగం కష్టం కావచ్చు. పాత ఎపిక్ ఫోటోలు, మసక వెలుతురు, లోరెజల్యూషన్ కెమెరాలు, ఇంటర్నెట్ అంతరాయాలు ధ్రువీకరణలో అడ్డంకులు కలిగించవచ్చు. టర్నింగ్ అధికారులకు డీఎస్సీ టోకెన్లు, బ్యాలెట్ అన్లాక్ వంటి వాటిపై ప్రత్యేక శిక్షణ అవసరం. గోప్యత, పారదర్శ కతపై రాజకీయ నాయకుల నుంచి వ్యతిరేకత రావచ్చు. కానీ బీహార్ ఎన్నికల సంఘం నమూనా ఓటింగ్, పబ్లిక్ డెమోల ద్వారా నమ్మకం సంపాదించడం చాలా సరైన వ్యూహం. ఈ సవాళ్లను అధిగమించడం ద్వారా ఈ వ్యవస్థ మరింత బలపడుతుంది. బీహార్ ఈ చొరవతో దేశ ఎన్నికల చరిత్రలో కొత్త అధ్యాయం రాస్తోంది. ఇది విజయవంతమైతే ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగి, నిజమైన ప్రజాసమ్మతి ప్రతిబింబిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మోడల్ను జాతీయ స్థాయిలో అధ్యయనం చేసి, ఎన్ఆర్ లు, వలస కార్మికులకు విస్తరించాలి. హైబ్రిడ్ మోడల్ (రిమోట్ +బూత్), నిరంతర సైబర్ ఆడిట్స్, సమగ్ర అవగాహన కార్యక్రమాలు చాలా అవసరం. డిజిటల్ ప్రజా స్వామ్యం కేవలం సాంకేతికత కాదు, అది ప్రతి పౌరుడి ఓటు హక్కును నిజం చేసే సామాజిక బాధ్యత. బీహార్ చూపిన మార్గం భారతదేశం మొత్తం అనుసరించాల్సిన మార్గం. జాగ్రత్తగా, పారదర్శకంగా అమలు చేస్తే ఇఓటింగ్ నిజమైన గేమ్ చేంజర్ కానుంది. ఈ అడుగు భారత ప్రజాస్వామ్యాన్ని 21వ శతాబ్దపు డిజిటల్ యుగానికి తీసుకెళ్లే చారిత్రక మైలురాయి అవుతుంది.
-ఎక్కులూరి నాగార్జున్ రెడ్డి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870