Mahesh Babu: టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ శివం దూబే, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లామర్ మరియు స్టైల్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దూబే మాట్లాడుతూ.. మహేష్ బాబును అత్యంత క్లాస్ మరియు హ్యాండ్సమ్ హీరోగా అభివర్ణించారు. నేను టాలీవుడ్ సినిమాలు కూడా చూస్తాను. హిందీ డబ్బింగ్ లో తెలుగు సినిమాలు చూస్తాను.మహేష్ బాబు అంటే ఇష్టం. ఆయన స్టైల్ బాగుంటుంది. క్లాస్ గా, హ్యాండ్సమ్ గా ఉంటారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కూడా బాగుంటుంది. అలాగే అల్లు అర్జున్ డ్యాన్స్ బాగుంటుంది. పుష్ప సినిమా చూసాను అని అన్నారు. దీంతో శివమ్ దూబే కామెంట్స్ ని మహేష్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
Read Also: INDW vs AUSW 2nd ODI: ఆస్ట్రేలియా ముందు 252 పరుగుల లక్ష్యం

ధోని మార్గదర్శకత్వం
ప్రస్తుతం శివమ్ దూబే టీమ్ ఇండియాలో కీలక ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో అతని పవర్ హిట్టింగ్ ప్రత్యేకం. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ, కెప్టెన్ ధోని మార్గదర్శకత్వంలో తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు. అవసరమైనప్పుడు మీడియం పేస్ బౌలింగ్‌తో వికెట్లు తీయగలగడం అతని ప్రత్యేకత. అతని భారీ షాట్లు చూసినప్పుడు అభిమానులకు యువరాజ్ సింగ్ గుర్తుకొస్తాడని పలువురు అభిప్రాయపడుతుంటారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: