हिन्दी | Epaper

Vishnu Vinyasam Movie Review: శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ చేరినట్టేనా?

Anusha
Vishnu Vinyasam Movie Review: శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ చేరినట్టేనా?

Vishnu Vinyasam Movie Review: టాలీవుడ్‌లో శ్రీవిష్ణుని ‘మ్యాన్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అని పిలుస్తారు. ఆయన నుంచి సినిమా వస్తోందంటే కచ్చితంగా పూర్తిస్థాయి వినోదం ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. దీనికి తగ్గట్టే ‘విష్ణు విన్యాసం’ సినిమాను మొదటి నుంచీ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రచారం చేశారు. శ్రీవిష్ణు మార్కు కామెడీ కోసం ఎదురుచూసే ఆడియన్స్‌లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read Also: Vijay Rashmika: అమిత్ షాను రిసెప్షన్‌కు ఆహ్వానించిన కొత్త జంట


దర్శకుడి విన్యాసం: టైటిల్‌తోనే ఆకట్టుకున్న యదునాథ్‌

దర్శకుడు యదునాథ్‌ మారుతీరావు ‘విష్ణు విన్యాసం’ అనే టైటిల్‌ను ప్రకటించగానే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. కేవలం ప్రచార చిత్రాలతోనే సినిమాపై హైప్‌ను పెంచడంలో చిత్ర యూనిట్ విజయం సాధించింది. కథాంశంపై ఉత్కంఠ రేకెత్తించడంలో దర్శకుడు తొలి అడుగులోనే మార్కులు కొట్టేశాడు.మరి ఇంతటి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘విష్ణు విన్యాసం’ ప్రేక్షకులను ఏ మేరకు అలరించింది? శ్రీవిష్ణు ఖాతాలో మరో కామెడీ హిట్ నమోదైందా లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమాలోని, అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? క్లైమాక్స్ వరకు ఎలా సాగింది? వంటి ఆసక్తికర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.

క‌థ‌
విష్ణు(శ్రీవిష్ణు) ఓ కాలేజ్‌లో ట్రైనీ లెక్చరర్‌గా పని చేస్తుంటాడు. తను పర్మినెంట్‌ అవ్వాలంటే అల్రెడీ అక్కడ పనిచేస్తున్న లెక్చరర్స్‌లో ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్‌గా కొన్నాళ్లు పనిచేయాలి. తనెవరి దగ్గరైతే పనిచేశాడో.. వాళ్లకు విష్ణు ప్రవర్తన, కేపబులిటీ నచ్చితే.. వాళ్లు కాలేజ్‌ హై కమాండ్‌కి ప్రిఫర్‌ చేస్తే అప్పుడు అతను పర్మినెంట్‌ లెక్చరర్‌ అవుతాడు. దీనికోసం సర్వవిధాలా ప్రయత్నిస్తుంటాడు విష్ణు. అయితే.. విష్ణుని ఎలాగైనా కాలేజ్‌ నుంచి పంపించేయాలని కొందరు లెక్చరర్స్‌ ప్రయత్నిస్తుంటారు. విష్ణుని ఎవరి దగ్గరా చేరనీయకంపడా పావులు కదుపుతుంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో అదే కాలేజ్‌లో పనిచేస్తున్న లేడీ లెక్చరర్‌ మనీషా(నయన్‌సారిక) విష్ణుని తన అసిస్టెంట్‌గా చేర్చుకుంటుంది. మనీషా అదొక టైప్‌. అన్ని వ్యసనాలూ ఉన్నట్టు కనిపిస్తున్న మనీషా దగ్గర తప్పక పనిచేస్తుంటాడు విష్ణు. కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా మనీషా, విష్ణు ప్రేమలో పడతారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో విష్ణుకు మనీషాకు సంబంధించిన ఓ నిజం తెలుస్తుంది. ఇంతకీ ఏవిటా నిజం? అసలు అన్ని వ్యసనాలూ ఉన్న అమ్మాయిలా మనీషా ఎందుకు కనిపించింది? అసలు శ్రీవిష్ణుకు మనీషా ఎందుకు దగ్గరైంది? మనీషాకూ, విష్ణుకీ పెళ్లి జరిగిందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.

Vishnu Vinyasam Movie Review
Vishnu Vinyasam Movie Review

కథనం

ఈ కథలోని కాంఫ్లిట్టే వైరైటీగా ఉంది. ప్రారంభం నుంచి ప్రశ్నలతోనే కథను మొదలుపెట్టాడు దర్శకుడు యదునాథ్‌ మారుతీరావు. జాతకాలను అతిగా విశ్వసించే హీరో.. జాతకంలో ఉండకూడని లోపం ఉన్న హీరోయిన్‌. ఇలాంటి ఇద్దరూ ప్రేమలో పడితే?.. గెలుపు నమ్మకానిదా? ప్రేమదా? అనేది ఈ కథలో కొత్తపాయింట్‌. దాన్ని దర్శకుడు మారుతీరావు వినోదాత్మకంగా చెప్పాడు. ఒకానొక దశలో హీరోయిన్‌ క్యారెక్టర్‌పైనే ఆడియన్స్‌కి అనుమానం కలిగేలా చేశాడు.

ఈ క్రమంలో బాగా నవ్వించాడు కూడా. ఇంట్రవెల్‌ బ్యాంగ్‌లో అసలు విషయం రివీల్‌ చేసి, అందరికీ షాక్‌ ఇచ్చాడు. సెకాండాఫ్‌ అంతా అసలు కథను నడిపించాడు. చివరకు వినోదాత్మకంగా ముగింపు పలికాడు. ఓ విధంగా ఇది హీరోయిన్‌ కథ. ఆమె జీవితంలోకి హీరో రావడం, ఆమె జీవితానికి ఓ అర్థాన్నివ్వడంతో కథ ముగిసింది. మొత్తంగా ప్రథమార్ధం కామెడీగా, ద్వితీయార్ధం కాస్తంత కామెడీ, కాస్తంత ఎమోషన్స్‌తో సరదాగా సినిమా గడిచిపోయింది..

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870