Virosh Wedding: టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ నూతన దంపతులు దేశ రాజధానిలో భారత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.
Read Also: Virosh Wedding: తెలుగు, కొడవ సంప్రదాయాల మేళవింపు



రిసెప్షన్‌కు గ్రాండ్ ఇన్విటేషన్
మార్చి 4వ తేదీన జరగనున్న తమ వివాహ రిసెప్షన్ వేడుకకు రావాల్సిందిగా కోరుతూ ప్రధాని మోదీకి వీరు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
రాజస్థాన్‌లో సీక్రెట్ వెడ్డింగ్
నిన్న (ఫిబ్రవరి 26న) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో విజయ్-రష్మికల వివాహం ఘనంగా జరిగింది. చాలా కాలంగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న వార్తలకు ఈ వివాహంతో తెరపడింది. ప్రస్తుతం వీరిద్దరూ ప్రధానిని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: