Sanju Samson: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన పోరులో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని అందుకుంది. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో జింబాబ్వేపై టీమిండియా బ్యాటింగ్ విప్లవం సృష్టించింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 256 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి ప్రత్యర్థిని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు సమిష్టిగా రాణించి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.
Read Also: T20 WC 2026: కొలంబోలో కీలక పోరు.. న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ సవాల్
సంజు శాంసన్ మెరుపులు.. అభిషేక్ శర్మతో భాగస్వామ్యం
ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తక్కువ సేపే ఆడినా తన మార్క్ చూపించాడు. కేవలం 15 బంతుల్లోనే 24 పరుగులు చేసి స్కోరు వేగాన్ని పెంచాడు. అభిషేక్ శర్మతో కలిసి రెండో వికెట్‌కు 48 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే, వేగంగా ఆడే ప్రయత్నంలో సంజు పెవిలియన్ చేరాడు. వేగంగా ఆడే క్రమంలో ఔటైన సంజు శాంసన్ కు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచాడు. పవర్‌ప్లేలో ఫీల్డింగ్ నిబంధనల నుంచి ప్రయోజనం పొందే క్రమంలోనే అతను ఔటయ్యాడని, అతడిని నిందించలేమని గవాస్కర్ పేర్కొన్నారు.

సెమీస్ అవకాశాలపై ప్రభావం..
ఆదివారం వెస్ట్ ఇండీస్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఒకవేళ వర్షం పడితే, ఫలితం నెట్ రన్ రేట్ ఆధారంగానే ఉంటుంది. ఇటువంటి సమయంలో జింబాబ్వేపై తక్కువ స్కోరుకే కట్టడి చేయకపోవడం జట్టుకు శాపంగా మారే అవకాశం ఉందని గవాస్కర్ హెచ్చరించారు. అర్ష్‌దీప్ సింగ్ మినహా మిగిలిన బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: