हिन्दी | Epaper

Rinku Singh Father Death: క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

Anusha
Rinku Singh Father Death: క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ప్రాణాంతకమైన లివర్ క్యాన్సర్ (ఫోర్త్ స్టేజ్) తో పోరాడుతున్నారు. గ్రేటర్ నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.రింకూ సింగ్ ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియాతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే పెళ్లి ఉందనగా తండ్రి మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Read Also: India semifinal chances : జింబాబ్వేపై భారత్ భారీ విజయం, సెమీస్ ఆశలు మళ్లీ జ్వలించాయి

Cricketer Rinku Singh's father passes away
Cricketer Rinku Singh’s father passes away

జట్టుతో ఉన్నా ఆడని రింకూ.. తీరని లోటు

తండ్రి అనారోగ్యం కారణంగా రింకూ ఇటీవల ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్ -8 మ్యాచ్‌కు ముందు జట్టు శిబిరాన్ని తాత్కాలికంగా వదిలి వెళ్లాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌కు ముందు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వద్ద తిరిగి జట్టుతో చేరినప్పటికీ, తుది జట్టులో అతడికి అవకాశం దక్కలేదు. అతడి స్థానంలో చివరి నిమిషంలో సంజూ శాంసన్‌కు చోటు కల్పించారు.రింకూ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఖంచంద్ సింగ్ కీలక పాత్ర పోషించారు.

అలీగఢ్‌లో ఎల్పీజీ సిలిండర్ డెలివరీ ఉద్యోగం చేస్తూనే, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కుమారుడికి క్రికెట్‌లో ముందుకు వెళ్లేందుకు పూర్తి సహకారం అందించారు. గత ఏడాది రింకు తన తండ్రికి రూ.3.19 లక్షల విలువైన కవాసాకి నింజా బైక్‌ను బహుమతిగా ఇచ్చిన విషయం కూడా అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. ఈ విషాదం క్రికెట్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించగా, పలువురు ఆటగాళ్లు రింకూ సింగ్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870