Telangana: తెలంగాణ విద్యాశాఖలో భారీ సంస్కరణలకు విద్యాకమిషన్ శ్రీకారం చుట్టింది. టీచర్లకు ఇప్పటివరకు అందుతున్న ఆటోమేటిక్ పదోన్నతుల విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. కేవలం సర్వీస్ సీనియారిటీని మాత్రమే ప్రాతిపదికన తీసుకోకుండా, వారి పనితీరు (Performance) ఆధారంగానే పదోన్నతులు కల్పించాలని కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది.
Read Also: Telangana IAS transfers : ఒకే జిల్లాకు భార్య కలెక్టర్, భర్త ఎస్పీ
ఐదేళ్లకోసారి పనితీరు అంచనా తప్పనిసరి
ఉపాధ్యాయుల జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రతి ఐదేళ్లకోసారి వారి పనితీరును అంచనా వేయడం తప్పనిసరి చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. ఈ మేరకు రెండేళ్లలో మెరుగుపడకపోతే సర్వీస్ నుంచి తొలగించేలా నిబంధనలు మార్చాలని సూచనలు చేసింది. ఈ నిబంధన ఇకపై నియమించే ఉపాధ్యాయులకు వర్తింపచేయాలని అభిప్రాయపడింది.
డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యకేషన్ (D.EI.ED)ను రద్దు చేయాలని, బీఎడ్‌ను పునర్వ్యవస్థీకరించి నర్సరీ నుంచి అయిదో తరగతి వరకు బీఎడ్ (ప్రైమరీ), 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బీఎడ్ (సెకండరీ) ఉంచాలి. ఇందుకు ఎన్‌సీటీఈతో సంప్రదించాలని నివేదికలో రాసుకొచ్చింది. బీఎడ్ విద్యార్థులకు పాఠశాలల్లో 150 రోజుల బోధనాభ్యసం తప్పని సరి చేయాలి పేర్కొంది. బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ ఉండాలి.. నర్సరీ నుంచి యూనివర్సిటీల వరకు బోధన మాధ్యమం ఇంగ్లీష్ ఉండాలని.. త్రిభాష విధానం ఒకటో తరగతి నుంచే అమలు చేయాలని పేర్కొంది.
పూర్వ ప్రాథమిక విద్యను (నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ) ప్రాథమిక పాఠశాలల్లో అందజేయాలని. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన బలమైన డిమాండ్ ఇది. పాఠశాల్లలో విద్యా ప్రమాణాలు, సిబ్బంది నియామకం, వసతుల కల్పన, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకు స్కూల్ డిస్ట్రిక్‌లను ఏర్పాటు చేయాలని.. పాఠశాలల్లో వంట వండే మహిళలకు వారానికి ఒకసారి చెల్లింపులు చేయాలి.. మధ్యాహ్న భోజన అంచనాలు, ప్రతిపాదనలు, చెల్లింపుల కోసం సమగ్ర సాఫ్ట్‌వేర్ వాడాలని పేర్కొంది.

ఉత్తీర్ణత శాతాన్ని 45 శాతానికి పెంచాలి
IIT-JEE/ NEET కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లను నియంత్రించేందుకు చట్ట సవరణ చేయాలి.. ఫీజులు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, తప్పుదారి పట్టించే ప్రకటనలపై నియంత్రణ అవసరమని.. ప్రైవేటు జూనియర్ కళాశాలల నుంచి వేరుగా పోటీ పరీక్షల కోచింగ్‌ను వేరు చేయాలని పేక్కొంది. 12వ తరగతిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలి.. EAPCET రద్దు చేసి ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రవేశాలు 12వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించాలి. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేయాలిని సూచించింది. విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడానికి కనిష్ట ఉత్తీర్ణత శాతాన్ని 45 శాతానికి పెంచాలని తెలిపింది.
విశ్వ విద్యాలయాల కార్యనిర్వాహక మండలిని పునర్నిర్మించాలి.. దానికి వైస్ ఛాన్సలర్ ఛైర్మన్‌గా ఉండాలని పేర్కొంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకం రిటైర్డ్ ఛీప్ సెక్రటరీ, యూజీసీ నామిని, ముగ్గురు రిటైర్డ్ వైస్ చాన్సలర్లతో కూడిన సెర్చ్ కమిటీ ద్వారా పారదర్శకంగా జరగాలని సూచించింది. యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయాలని.. విద్యార్థుల నుంచి డిమాండ్ ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని పేర్కొంది. లింగ్డో కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థుల ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది.మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వ విద్యాలయం తరహాలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయాన్ని బహుళ-విభాగ విశ్వ విద్యాలయంగా అభివృద్ధి చేయాలని ప్రతి డిగ్రీ కాలేజీకి అనుబంధంగా 200 మంది అతి పేద విద్యార్థులకు హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: