
Adulterated Food: భాగ్యనగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మరో కల్తీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎం.ఎస్.మఖ్తా, రైల్వే గేట్ సమీపంలోని అక్రమ తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున నిల్వ ఉంచిన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటపడింది.
Read Also: Velugumatla House Collapse : కాంగ్రెస్ కూలగొట్టిన చోటే..ఇళ్లు కట్టిస్తాం – కేటీఆర్
JJ ఫుడ్స్ పేరుతో భారీ దందా
ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించి 21 ఏళ్ల జసాని ఇల్యాన్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ‘JJ ఫుడ్స్’ అనే బ్రాండ్ పేరుతో కల్తీ పేస్ట్‌ను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించడమే లక్ష్యంగా కుళ్ళిన పదార్థాలు, హానికరమైన రంగులు కలిపి ఈ పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు సమాచారం.
తనిఖీల్లో మొత్తం 4 వేల కేజీల కల్తీ పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 40 టబ్బుల్లో 1,600 కేజీలు, 5 కేజీల కంటైనర్లు 130 , 1 కేజీ కంటైనర్లు 900, 500 గ్రాముల కంటైనర్లు 300, 200 గ్రాముల కంటైనర్లు 3,000 , 50 గ్రాముల ప్యాకెట్లు 2,000 ఉన్నాయి. అదేవిధంగా రెండు గ్రైండింగ్ మెషీన్లు, 5 కేజీల పసుపు పొడి, 20 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 40 బస్తాల ఉప్పు సరఫరాకు వినియోగిస్తున్న గూడ్స్ ఆటోను సీజ్ చేశారు. నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం లేక్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: