हिन्दी | Epaper

Headache in Winter: ఉదయం లేవడంతోనే కళ్ళు తిరుగుతుంటే ఈ రోగ లక్షణాలకు సంకేతం

Saritha
Headache in Winter: ఉదయం లేవడంతోనే కళ్ళు తిరుగుతుంటే ఈ రోగ లక్షణాలకు సంకేతం

Headache in Winter: చలికాలం మొదలైందంటే చాలు, చాలా మందిలో ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే తల తిరగడం, ఒక్కోసారి కింద పడిపోవడం వంటివి జరుగుతుంటాయి. దీనికి తోడు తీవ్రమైన తలనొప్పి కూడా తోడవుతుంది. వాతావరణంలో మార్పులు ఒక కారణమైతే, మన జీవనశైలిలో చేసే కొన్ని తప్పులు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి.

Read Also: Health Awareness: క్యాన్సర్ ముందస్తు సంకేతాలు

Headache in Winter: ఉదయం లేవడంతోనే కళ్ళు తిరుగుతుంటే ఈ రోగ లక్షణాలకు సంకేతం
Headache in Winter: If your eyes are spinning upon waking up in the morning, it is a sign of these symptoms

నిద్రలేమి: మెదడు పనితీరుపై ప్రభావం

ఈ సమస్యకు ప్రధాన కారణం సరైన నిద్ర లేకపోవడం. రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం వల్ల మెదడుకు కావాల్సిన విశ్రాంతి దొరకదు. ఫలితంగా మెదడు పనితీరు మందగిస్తుంది. రాత్రిపూట ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ లైట్ చూడటం వల్ల కళ్ళపై ఒత్తిడి పడి, మెదడు మేల్కొనే ఉంటుంది. దీనివల్ల గాఢ నిద్ర పట్టక, మరుసటి రోజు ఉదయం తల తిరగడం (Vertigo) వంటి లక్షణాలు కనిపిస్తాయి.

విటమిన్ డి లోపం

విటమిన్ డి లోపం ఉన్నవారిలో కూడా ఉదయం లేవగానే పడి పోతుంటారు. కాబట్టి, మీ ఫుడ్ డైట్ లో విటమిన్ డి ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి.

మానసిక ఒత్తిడి

అతిగా ఆలోచించినప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. టెన్షన్, ఒత్తిడి వలన నిద్ర పట్టదు దీని వలన తల తిరగడం మొదలవుతుంది.

నీరు తక్కువగా తీసుకోవడం

నీరు తక్కువగా తీసుకున్న వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే తగిన నీరు తీసుకోవాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870