Hyderabad Crime: హైదరాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్ (Banjara Hills) పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెలు అవిసిపోయే విషాదం చోటు చేసుకుంది. ఫోన్‌లో వీడియోలు చూడవద్దని, గేమ్స్ ఆడవద్దని తండ్రి మందలించినందుకే ఓ 12 సంవత్సరాల బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన స్థానిక సయ్యద్ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది.
Read Also: Komali: డైరీలో యూట్యూబర్ కోమలి చివరి మాటలు

స్కూల్‌కు డుమ్మా.. వీడియో గేమ్స్‌కు బానిస
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12, ఫస్ట్ లాన్సర్ సయ్యద్ నగర్‌లో నివసించే మహ్మద్ అఫాన్ ఖాన్ (12) సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. తండ్రి ఇర్ఫాన్ ఖాన్ వాల్ పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో అఫాన్ మారు తల్లి వద్ద పెరుగుతున్నాడు. అయితే, అఫాన్ గత కొంతకాలంగా మొబైల్ ఫోన్‌కు బానిసయ్యాడు. తండ్రి ఎంత చెప్పినా వినకుండా ఫోన్‌లో వీడియో గేమ్స్ చూస్తూ తరచూ స్కూల్‌కు డుమ్మా కొట్టేవాడు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు పాఠశాలలు మారినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.
ఇప్పటికే మూడు స్కూల్స్ మారాడు. స్కూల్‌కు సక్రమంగా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ వీడియో గేమ్స్ చూస్తుండడంతో తండ్రి మందలించాడు. ఇర్ఫాన్ ఖాన్ తన భార్యతో కలిసి బంధువుల అంత్యక్రియలకు వెళ్లాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న అఫాన్ తన గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: