Tirupati crime: వివాహేతర సంబంధం చివరకు నవమాసాలు మోసి కన్నపేగును కూడా దారుణంగా చిదిమేసింది. అల్లారుముద్దుగా ఓలలాడించి అన్నం తినిపించాల్సిన చేతులతోనే దారుణంగా హత్యచేసి ఆపై ఏమీతెలియనట్లు బుకాయించింది. అమ్మమ్మ ఫిర్యాదుతో ఈ విషాద ఘటనను తిరుపతి తూర్పుపోలీసులు తమదైన శైలిలో చేధించి వెలుగు లోకి తీసుకువచ్చారు.
పోలీసుల విచారణలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు
తూర్పు పోలీసుల వివరాల మేరకు ఆటోనగర్‌లో నివాసముంటున్న నాగ రత్నమ్మకు రంగాతో వివాహమైంది. వీరికి ఆశాలత(19) ఉంది. ఆమెకు రాజేశ్ తో వివాహమైంది. దుర్గ రెండున్నరేళ్ళ పాప ఉంది. కొంతకాలం క్రిందట కుటుంబ కారణాలతో భర్తతో విడిపోయిన ఆశాలత తిరుపతి పోస్టల్ కాలనీలో నివసిస్తోంది. కొంతకాలం క్రిందట ఆమెకు ఏర్పేడు మండలం చెన్నంపల్లికి చెందిన రెడ్డికుమార్తో పరిచయం ఏర్పడింది. అది సహజీవనానికి దారి తీసింది. అతనిని పెళ్లి చేసుకోవాలని ఆశాలత నిర్ణయించుకుంది. తమకు చిన్నారి అడ్డుగా ఉంటుందని, తన కొత్త జీవితానికి దుర్గ అడ్డంకిగా మారుతుందని భావించి అమానుష నిర్ణయం తీసుకుంది. ఆపై ఏమీ తెలియనట్లు ఉంది.
Read Also: Sunil Nayak Arrest Warrant: సునీల్ నాయక్‌కు అరెస్ట్ వారెంట్

అమ్మమ్మ ఫిర్యాదుతో బయటపడ్డ హత్య
ఈ విషయం తెలుసుకున్న అమ్మమ్మ నాగరత్నమ్మ మనవరాలి గురించి ఆరా తీసింది. అయితే మనవరాలు కనబడుటలేదని నాగరత్నమ్మ ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు అనుమానంతో తల్లి ఆశాలతను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. పోలీసుల విచారణలో కూతురిని హత్య చేసి, స్వర్ణముఖి నది సమీపంలో పాతిపెట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించింది.
నిందితుల అరెస్ట్
దీంతో ఆమెను తూర్పు పోలీసులు లోతుగా విచారణ చేశారు. కేవలం వివాహేతర సంబంధం అడ్డుకావడంతోనే కన్నకూతురిని హతమార్చిందని తేలింది. ఈ దారుణ ఘటన వెలుగుచూడటంతో సమాజంలో మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రియుడి వ్యామోహంలో పడి చిన్నారిని ప్రాణం తీసిన తల్లికి తగిన శాస్త్రిచేయాలని, కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు. తిరుపతి డిఎస్పీ భక్తవత్సలం, సిఐ శ్రీనివాసులు ఈ కేసును మరింతగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ విషాదఘటనకు కారణమైన రెడ్డికుమారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: