हिन्दी | Epaper

Sunil Nayak Arrest Warrant: సునీల్‌ నాయక్‌కు అరెస్ట్‌ వారెంట్‌

Saritha
Sunil Nayak Arrest Warrant: సునీల్‌ నాయక్‌కు అరెస్ట్‌ వారెంట్‌

Sunil Nayak Arrest Warrant: ఆంధ్రప్రదేశ్ (AP) డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు విచారణకు హాజరుకావాలని పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో, అతడిని అరెస్టు చేయడానికి గుంటూరు ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని బృందం పట్నా వెళ్లింది. అయితే, ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయడానికి పట్నా హైకోర్టు నిరాకరించడంతో, గుంటూరు మొబైల్ కోర్టులో పోలీసులు అరెస్ట్ వారెంట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

Read Also: Hyatt Regency: నారా లోకేష్ ముంబై పర్యటన ఖరారు

Sunil Nayak Arrest Warrant: సునీల్‌ నాయక్‌కు అరెస్ట్‌ వారెంట్‌
Sunil Nayak Arrest Warrant: Arrest warrant issued for Sunil Nayak

కస్టోడియల్ టార్చర్ కేసు ఏంటి?

గత ప్రభుత్వ హయాంలో నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ రాజుపై రాజద్రోహం కేసు నమోదైంది. ఆయన ను హైదరాబాద్‌లో అరెకస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు గుంటూరు తీసుకొచ్చారు. ఆయన ను కస్టడీలోకి తీసుకోగా.. ఆ సమయంలో తనను చిత్రహింసలకు గురిచేశారని రఘురామ ఆరోపించారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. కాళ్లపై దారుణంగా కొట్టారన్నారు. ఈ కస్టోడియల్ టార్చర్ అంశంపై గత ప్రభుత్వ హయాంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామ మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో సునీల్ నాయక్ పాత్ర కూడా ఉందని ఫిర్యాదు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870