हिन्दी | Epaper

AP Stree Shakti Scheme: మహిళా ప్రయాణికుల సంఖ్య 65 శాతానికి పెరిగింది

Saritha
AP Stree Shakti Scheme: మహిళా ప్రయాణికుల సంఖ్య 65 శాతానికి పెరిగింది

మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి

AP Stree Shakti Scheme: ఎపిలో మహిళా ప్రయాణికుల సంఖ్య 65శాతంకి పెరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పునరుద్ఘాటించారు. అసెంబ్లీలో బడ్జెట్ డిమాండ్పై చర్చలో మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులకు ఉచిత ప్రయాణంపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్ల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. రవాణా శాఖలో ఆటోమేషన్-ఎడిటీటీ. ఎటీఎస్లను విస్తరిస్తున్నట్లు తెలిపారు.

Read Also: Job Mela 2026: గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా

AP Stree Shakti Scheme: మహిళా ప్రయాణికుల సంఖ్య 65 శాతానికి పెరిగింది
AP Stree Shakti Scheme: Number of women passengers increased to 65 percent

47 కోట్ల ఉచిత ప్రయాణాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) చొరవతో 15-08 -2025న ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సిటి ఆర్డినరీ, సిటి ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు సహా ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

రూ.1660 కోట్ల సబ్సిడీ

ఇప్పటి వరకు 47 కోట్ల ప్రయాణాలు జరగగా, రూ.1660 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం భరించిందన్నారు. ఈ పథకం అమలుతో మహిళా ప్రయాణికుల శాతం 40 నుంచి 65కు పెరిగిందని, రోజుకు సగటున 25 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని వెల్లడించారు.

ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ద్వారా 2025-2026, 2,90,669, 5.436 కోట్లు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. డోన్ (కర్నూలు), దర్శి (ప్రకాశం)లలో డ్రైవర్ల శిక్షణ పరిశోధన సంస్థలు (ఐడిటిఆర్) నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. విశాఖ పట్నం గంభీరంలో రూ.16.50 కోట్లతో ఐసి సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పిఎంఈ బస్ సేవ ద్వారా 750 కొత్త బస్సులు రాష్ట్రానికి రానున్నాయని, సిఎన్జ, ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870