Telangana: మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలతో పాటు క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు వరుసగా పోలీసులకు లొంగిపోతున్న నేపథ్యంలో అజాతంలో వున్న ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి కూడా ఇదే తరహాలో లొంగిపోవాలని -ఆయన సోదరుడు రామచంద్ర రావు కోరారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విజ్ఞప్తి చేశారు. దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించిన గణపతి ప్రస్తుతం వయో భారంతో నక్సల్స్‌కు -పట్టుగా వున్న ఛత్తీస్ ఘడ్లో కాకుండా మరోచోట రహస్య షెల్టర్‌లో వుంటున్నట్లు వార్తలు -వస్తుండడం తెలిసిందే.
Read also: Tirumala: వేదాశీర్వచనానికి మేలాఛాట్ వస్త్రాల కొరత!

ఈ షెల్టర్ నేపాల్ లేదా ఫిలిఫైన్స్ కావచ్చని తాజా వార్తలు చెబుతున్నాయి. గణపతి సతీమణి విజయ ఇటీవల నేపాల్‌కు వెళడం ఇందుకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే గణపతిని తమకు అప్పగించాలని భారత్ నేపాల్‌ను కోరినట్లు వార్తలు వచ్చాయి. ఫి లిఫైన్స్లోని కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ మావోయిస్టు పార్టీ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ సౌత్ ఏసియా (CCOMPPOSA) సంస్థ ఆధ్వర్యంలో కొనసా గుతున్న రహస్య షెల్టర్‌లో గణపతి తలదాచుకున్నట్లు ఈ వార్తలు చెబు తున్నాయి.
మావోయిస్టు పార్టీ అగ్రనేతలు
2001లో ఏర్పడ్డ ఈ సంస్థ దక్షిణాసియా దేశాలలో వున్న మావో యిస్టు పార్టీలు, నేతలతో సంబంధం కలిగివుండడంతో పాటు ఒకకొకొకరు సహకచించేందుకు కృషి చేస్తుందని పోలీసుల వద్ద వున్న రికార్డులు చెబుతున్నాయి. మంగళవారం నాడు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్ జీ, బడే చొక్కారావు, నూనె నరసింహా రెడ్డి, మల్ల రాజిరెడ్డిలు డిజిపి శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోవడం తెలిసిందే. ఇదే సమయంలో గణపతి గురించి చర్చ వచ్చింది. గణపతి లొంగిపోతే మంచిదేనని డిజిపి చెప్పడం సంచలన రేపడం విదితమే. ఇలా ఓ వైపు గణపతి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో ఆయన అన్న కుమారుడు కరీంనగర్‌కు చెందిన రామ చంద్రరావు బుధవారం నాడు ఆనూహ్యంగా మీడియా ముందుకు వచ్చారు. తన సోదరుడు గణపతి లొంగిపోవాలని ఆయన మీడియా సాక్షిగా కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: