हिन्दी | Epaper

Medak Collector Inspection: అర్ధరాత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, వైద్యశాలలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

Tejaswini Y
Medak Collector Inspection: అర్ధరాత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, వైద్యశాలలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

Medak Collector Inspection: ప్రజా ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్ట పరిచే లక్ష్యంగా ముందుకు సిబ్బంది సమయపాలన , రోగులకు అందిస్తున్న వైద్య సేవలు ఆస్పత్రి పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్. అర్ధరాత్రి 12 గంటల సమయంలో రామాయణపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించగా నైట్ డ్యూటీ లో ఉండాల్సిన డాక్టర్లు, నర్సులు పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అని పరిశీలించారు. రోగులకు అందిస్తున్న ఎమర్జెన్సీ కేసుల వివరాలు, ఆస్పత్రి పనితీరు సుదీర్ఘంగా పరిశీలించారు.

Read Also: Greenfield Highway: మే నెలలో ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం!

Medak Collector Inspection: Collector conducts surprise inspections of community health centers and hospitals at midnight
Medak Collector Inspection: Collector conducts surprise inspections of community health centers and hospitals at midnight

తూప్రాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్

అనంతరం సుమారు ఒంటిగంట ప్రాంతంలో తూప్రాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించి అప్పుడే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో గాయాలతో ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్న రోగి తో మాట్లాడటం జరిగింది. ఆసుపత్రులలో ఏ విధమైన వైద్య సేవలు అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి విభాగాలను పరిశీలించడం జరిగింది విధులలో ఉండాల్సిన డాక్టర్లు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం వల్ల హర్ష వ్యక్త చేశారు. రాత్రి రెండు గంటల సమయంలో నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి చేరుకొని అన్ని విభాగాలు పరిశీలించి, డెలివరీ కేసులను వాకబు చేసి ,ఒక డెలివరీ కేసు సంబంధించి మంచి చికిత్స అందించాలి సిబ్బందికి సూచించారు. అనంతరం కౌడిపల్లి కి పి హెచ్ సి కి చేరుకొని విధుల్లో ఉండాల్సిన సిబ్బంది ఉన్నారా లేరా అని ఆరా తీశారు.

అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలో అన్ని వైద్య శాలల్లో డాక్టర్, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర వైద్య సిబ్బంది అందరూ విధుల్లో నిమగ్న్మం అయినందున హర్షం వ్యక్తం చేస్తూ ..జిల్లాలో వైద్య సేవలు గతంలో కంటే చాలా మెరుగైనవని సంతోషం వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో ,సెలవు రోజుల్లో,పండుగ పూట కూడా ఎప్పుడూ ఆకస్మిక తనిఖీ చేసిన కూడా ఆరోజు విధుల్లో ఉండాల్సిన వైద్య సిబ్బంది విధుల్లో ఉండడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇదే స్పూర్తి తో ఇంకా మెరుగైన వైద్య అందించాలని వైద్య సిబ్బందిని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870