हिन्दी | Epaper

Adulterated Milk in Kadthal: కడ్తాల్‌లో కల్తీ పాల గుట్టురట్టు.. ఎస్ఓటి పోలీసుల మెరుపు దాడులు

Siva Prasad
Adulterated Milk in Kadthal: కడ్తాల్‌లో కల్తీ పాల గుట్టురట్టు.. ఎస్ఓటి పోలీసుల మెరుపు దాడులు

Adulterated Milk in Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో కల్తీ పాల విక్రయాలు కలకళం రేపాయి. గుట్టుచప్పుడు కాకుండా కృత్రిమ పాలను తయారు చేసి వివిధ డైరీలకు సరఫరా చేస్తున్న కేంద్రంపై మహేశ్వరం ఎస్ఓటి (SOT) పోలీసులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు.

Read Also: Congress Govt : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటుంది – హరీష్ రావు

షాద్‌నగర్ నుంచి ముడిపదార్థాలు.. రావిచేడ్‌లో తయారీ
గ్రామంలో పాల సేకరణ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న శ్రీశైలం గౌడ్ అనే వ్యక్తి ఈ అక్రమ దందాకు తెరలేపాడు. నిందితుడు షాద్‌నగర్ నుంచి కల్తీ పాలు తయారు చేసేందుకు అవసరమైన కృత్రిమ ముడిపదార్థాలను కొనుగోలు చేసి తెచ్చేవాడు. వాటిని పాల క్యాన్లలో కలిపి కృత్రిమ పాలను తయారు చేసి, ఏమాత్రం అనుమానం రాకుండా ప్రముఖ డైరీలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Adulterated Milk in Kadthal: సీజ్ చేసిన పోలీసులు

నమ్మదగిన సమాచారంతో దాడులు చేసిన ఎస్ఓటి పోలీసులు.. పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన కృత్రిమ పాలను గుర్తించారు. పట్టుబడిన పాలను మరియు రవాణాకు ఉపయోగిస్తున్న ఆటోను సీజ్ చేసి కడ్తాల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు కడ్తాల్ సిఐ గంగాధర్ తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870