हिन्दी | Epaper

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ

Saritha
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ

Telangana: అడోబ్ (Adobe) సీఈవో, ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ బోర్డు సభ్యుడు శంతను నారాయణ్ హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (Revanth Reddy) భేటీ అయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు, పారిశ్రామికాభివృద్ధి మరియు సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రస్తుత ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ రంగంపై చూపుతున్న ప్రభావం గురించి శంతను నారాయణ్ మరియు ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. తెలంగాణను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా (Manufacturing Hub) మార్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్లోబల్ ట్రెండ్స్, గ్రీన్ ఎనర్జీ ,కొత్త పారిశ్రామిక అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్‌ను పంచుకున్నారు.

Read Also: Education : భవిష్యత్తు తరగతి గదుల్లోనా, బడ్జెట్ అంకెల్లోనా?

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
Telangana: Shantanu Narayan meets Chief Minister Revanth Reddy

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870