Maoist Leader Ganapati: దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన అగ్రనేత గణపతి (ముప్పాళ్ల లక్ష్మణరావు) త్వరలోనే పోలీసుల ముందు లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తెలంగాణ (TG) పోలీసులతో రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం గణపతి పొరుగు దేశమైన నేపాల్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. వృద్ధాప్యం మరియు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, అక్కడ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Nagar Kurnool Incident: నిందితులకు కఠిన శిక్ష పడాల్సిందే: కేటీఆర్

కేంద్ర బలగాలకు అప్పగించొద్దు
లొంగుబాటుకు సంబంధించి గణపతి ఒక కీలక షరతును ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. తనను తెలంగాణ (TG) పోలీసులకే అప్పగించాలని, కేంద్ర భద్రతా బలగాలకు, ఏజెన్సీలకు అప్పగించకూడదని ఆయన కోరినట్లు సమాచారం. వృద్ధాప్యం, తీవ్ర అనారోగ్యంతో నేపాల్లో చికిత్స పొందుతున్న గణపతి ఆరోగ్యంపై క్లారిటీ రాగానే లొంగుబాటు చూపవచ్చంటున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: