हिन्दी | Epaper

Central Govt: ఈ నెల 28 నాటికి KYC తప్పనిసరి

Saritha
Central Govt: ఈ నెల 28 నాటికి KYC తప్పనిసరి

Central Govt: రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న బోగస్ కార్డులను ఏరివేసేందుకు, పారదర్శకతను పెంచేందుకు కఠిన నిబంధనలను సిద్ధం చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుండి పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నాయి. అర్హులైన పేదలకు మాత్రమే సబ్సిడీ బియ్యం, ఇతర సరుకులు అందేలా చూడటమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం.

Read Also: Vande Bharat Train Accident: జార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి

Central Govt: ఈ నెల 28 నాటికి KYC తప్పనిసరి
Central Govt: KYC mandatory by 28th of this month

బోగస్ కార్డుల తొలగింపు లక్ష్యం

రేషన్ కార్డులో (Ration card) పేరున్న ప్రతి ఒక్క సభ్యుడు తప్పనిసరిగా తమ ఆధార్ ద్వారా e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. దీనికి ఫిబ్రవరి 28, 2026ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఒకవేళ నిర్ణీత గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే, మార్చి 1 నుండి సదరు సభ్యులకు లేదా ఆ కార్డుపై వచ్చే రేషన్ సరఫరాను నిలిపివేయనున్నట్లు అధికారులు స్పష్టంగా హెచ్చరించారు.

అనర్హులు కూడా రేషన్ పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా అసలైన లబ్ధిదారులను గుర్తించి, నకిలీ కార్డులను తొలగించడం ద్వారా ప్రభుత్వ పై పడే అనవసర భారాన్ని తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. మీ రేషన్ అంతరాయం కలగకుండా ఉండాలంటే, వెంటనే రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ పూర్తి చేయండి. ఆధార్ నంబర్ ఆధారంగా మీ కార్డు యాక్టివ్‌గా ఉంటుంది. ఏప్రిల్ 1 నుండి అమలు కానున్న నిబంధనల దృష్ట్యా, లబ్ధిదారులు త్వరగా స్పందించి e-KYC పూర్తి చేసుకోవడం ఉత్తమం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870