సోషల్‌మీడియా (Social Media) చూపుతున్న ప్రభావం అంతా ఇంతా కాదు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా అందరి జీవితంలో ఇది భాగమైపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరూ సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ వ్యూస్ పెంచుకుని స్టార్ డమ్ సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇన్‌ప్లూయెన్సర్లైతే డబ్బుకోసం యాడ్స్‌ను కూడా ప్రొమోట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇన్‌ఫ్లూయెన్సర్ (Chinese Influencer) తన భార్య ప్రసవ వేదను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనాకు చెందిన ఇన్‌ఫ్ల్యూయెన్సర్ పాల్ ఇన్ యూఎస్ఏ (Paul in USA)కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
Read Also: Milan Cortina Olympics 2026: హాకీ గోల్‌కీపర్ కొన్నార్ హెల్లిబక్‌కు ‘మెడల్ ఆఫ్ ఫ్రీడం’

లైవ్ వీడియో చర్చకు దారి
12.2 మిలియన్ల మంది అతడి పేజిని అనుసరిస్తున్నారు. వీడియోలు, యాడ్స్ ప్రొమోట్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. అతడి భార్య ప్రసవ వేదనను వీడియో తీసి సోషల్ మీడియాలో లైవ్ పెట్టాడు. అంతటితో ఆగని అతడు మధ్యలో యాడ్స్‌ను కూడా ప్రొమోట్ చేశాడు. ఈ మధ్యలోనే ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఫలితంగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు అతడిపై విమర్శలకు ఎక్కుపెట్టారు. భార్య ప్రాణాలతో పోరాడుతుంటే.. వీడియో తీసి టైమ్‌పాస్ చేస్తున్నావా..? అంటూ మండిపడుతున్నారు. భార్య ప్రసవ వేదనతో బాధ పడుతుంటే డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతావా..? అంటూ ఫైర్ అవుతున్నారు. నెజటిన్ల నుంచి ఆగ్రహం తగ్గకపోవడంతో పలు ప్లాట్‌ఫామ్స్ అతడి సోషల్ మీడియా ఖాతాలను నిషేధించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: