हिन्दी | Epaper

AP Budget Sessions: అసెంబ్లీలో దివంగత మాజీ సభ్యులకు నివాళి

Saritha
AP Budget Sessions: అసెంబ్లీలో దివంగత మాజీ సభ్యులకు నివాళి

AP Budget Sessions: ఆంధ్రప్రదేశ్ (AP) బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల తొమ్మిదో రోజు మంగళవారం సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయ నేతలకు సభనివాళి అర్పించింది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాజీ సభ్యుల మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ సభలో సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు.

Read Also: TS10th Exams: మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు.. 5న హాల్‌టికెట్ల విడుదల

AP Budget Sessions: అసెంబ్లీలో దివంగత మాజీ సభ్యులకు నివాళి
AP Budget Sessions: Tributes paid to late former members in the Assembly

సభలో మౌనం శ్రద్ధాంజలి

ప్రజా జీవితంలో వారు అందించిన విశేష సేవలను స్పీకర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పిడతల రాంభూపాల్ రెడ్డి (గిద్దలూరు), ఆసిఫ్ పాషా (విజయవాడ పశ్చిమ), డాక్టర్ గుంటి వెంకటేశ్వర ప్రసాద్ (రైల్వేకోడూరు), మృతి పట్ల స్పీకర్ సంతాపం తెలిపారు. అలాగే, గంటెల సుమన (పాకరాపేట), గుండ అప్పలసూర్యనారాయణ (శ్రీకాకుళం), ఈలి వరలక్ష్మి (తాడేపల్లిగూడెం), ఎల్లవరం (ప్రస్తుత రంపచోడవరం) మాజీ ఎమ్మెల్యే రత్నాబాయి మృతి పట్ల సభతీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ దివంగత నేతలందరూ చట్టసభల ద్వారా ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారని స్పీకర్ కొనియాడారు. నేతల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ సభలోని సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870