हिन्दी | Epaper

TS10th Exams: మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు.. 5న హాల్‌టికెట్ల విడుదల

Pooja
TS10th Exams: మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు.. 5న హాల్‌టికెట్ల విడుదల

TS10th Exams: తెలంగాణ రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది నుంచి పదో తరగతి హాల్‌టికెట్లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కు నేరుగా పంపించాలని విద్యాశాఖ నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు డిజిటల్ హాల్‌టికెట్లు పంపనున్నారు.

Read Also:Telangana Inter Exams 2026 : నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

TS10th Exams
TS10th Exams: Class 10th exams from March 14th.. Hall tickets released on the 5th

క్యూఆర్ కోడ్‌తో ఎగ్జామ్ సెంటర్ మ్యాప్

అలాగే ఈ ఏడాది హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే గూగుల్ మ్యాప్ నావిగేషన్ తెరుచుకొని, పరీక్ష కేంద్రానికి వెళ్లే మార్గాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి. హాల్‌టికెట్లు మార్చి 5న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయడంతో పాటు, తల్లిదండ్రుల వాట్సాప్‌కు కూడా పంపిస్తారు. ప్రింటెడ్ హాల్‌టికెట్లు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 5,17,727 రెగ్యులర్ విద్యార్థులు, 10,512 ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం 5,28,238 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. గత ఏడాదితో పోల్చితే సుమారు 20,000 మంది అదనంగా పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో పరీక్ష కేంద్రాల సంఖ్యను కూడా పెంచారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల సౌకర్యార్థం క్లోక్ రూమ్ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష సమయంలో విద్యార్థులు తమ బ్యాగ్‌లు, వస్తువులను క్లోక్ రూమ్‌లో ఉంచి పరీక్ష అనంతరం తీసుకెళ్లవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870