हिन्दी | Epaper

Thailand Tiger Deaths: థాయ్‌లాండ్‌లో 72 పులుల మృతి

Anusha
Thailand Tiger Deaths: థాయ్‌లాండ్‌లో 72 పులుల మృతి

Thailand Tiger Deaths: థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయ్ ప్రావిన్స్‌లో ఉన్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ‘టైగర్ కింగ్‌డమ్’లో పెను విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 8 నుంచి 18 మధ్య కేవలం పది రోజుల వ్యవధిలోనే 72 పులులు మరణించడం అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది. మే రిమ్ (Mae Rim).మే తేంగ్ (Mae Taeng) జిల్లాల్లోని రెండు వేర్వేరు పార్కులలో ఈ మరణాలు సంభవించాయి.

Read Also: Rangareddy District: వైద్యుల నిర్లక్ష్యం.. గర్భంలోనే శిశువు మృతి

కారణం ‘కెనైన్ డిస్టెంపర్’.. బర్డ్ ఫ్లూ కాదని స్పష్టీకరణ

తొలుత ఈ మరణాలకు బర్డ్ ఫ్లూ (H5N1) కారణమని ప్రచారం జరిగినప్పటికీ, తాజా ల్యాబ్ రిపోర్టులు దానిని తోసిపుచ్చాయి. పులుల కళేబరాల నుంచి సేకరించిన నమూనాలలో కెనైన్ డిస్టెంపర్ వైరస్ (CDV), మైకోప్లాస్మా బ్యాక్టీరియా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా కుక్కలలో కనిపించే ఈ వైరస్, పిల్లి జాతికి చెందిన పులులకు సోకినప్పుడు అత్యంత ప్రాణాంతకంగా మారుతుంది. పులులకు ఆహారంగా వేసిన మాంసం ద్వారా లేదా అడవి కుక్కల ద్వారా ఈ వైరస్ వ్యాపించి ఉండవచ్చని వెటర్నరీ నిపుణులు భావిస్తున్నారు.

72 tigers die in Thailand
72 tigers die in Thailand

హై అలర్ట్: పర్యాటక పార్కులు మూసివేత

వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి థాయ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. చియాంగ్ మాయ్‌లోని టైగర్ పార్కులను తాత్కాలికంగా మూసివేసి, హై అలర్ట్ ప్రకటించారు. మిగిలిన 124 పులులను క్వారంటైన్‌కు తరలించి, ప్రత్యేక నిఘాలో ఉంచారు. వీటికి వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. ఈ వైరస్ మానవులకు సోకే ప్రమాదం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలకు భరోసా ఇచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870