T20 WC 2026: టీ20 ప్రపంచకప్ సూపర్-8 పోరులో దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు పరాజయం పాలవ్వడంపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించారు. ఈ ఓటమి జట్టుకు ఒక రకంగా ‘వార్నింగ్ బెల్’ లాంటిదని, ఇది భవిష్యత్తులో మేలు చేస్తుందని ఆయన విశ్లేషించారు. “ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ గెలిచి ఉంటే, అదే అతివిశ్వాసంతో సెమీస్ లేదా ఫైనల్‌లో తడబడేది. కీలక సమయంలో పెద్ద ప్రమాదం జరగడం కంటే, ఇప్పుడే లోపాలు బయటపడటం శుభపరిణామం” అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
Read Also: Rinku Singh Father Health: ప్రపంచకప్ మధ్యలోనే రింకూ సింగ్ నిష్క్రమణ!
గంభీర్ సేన కసరత్తు చేయాల్సిందే.. లోపాలు సరిదిద్దుకోవాలి!
దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టు చేతిలో ఎదురైన ఈ పరాజయాన్ని గుణపాఠంగా తీసుకోవాలని శాస్త్రి సూచించారు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు తన నెగిటివ్ పాయింట్లపై దృష్టి పెట్టాలన్నారు. కోచ్ గౌతమ్ గంభీర్ జట్టును ముందుండి నడిపించాలని, అసలు బ్యాటింగ్ లేదా బౌలింగ్.. ఏ విభాగంలో విఫలమయ్యామనే దానిపై స్పష్టమైన సమీక్ష నిర్వహించాలని కోరారు. పాత తప్పిదాలు మళ్ళీ చేయకుండా ఉంటేనే భారత్ ఛాంపియన్‌గా నిలవడం సాధ్యమని స్పష్టం చేశారు.ఈ ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలతో తదుపరి మ్యాచ్‌లలో భారత్ సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు.

మరోవైపు, సూపర్-8లో మొదటి మ్యాచ్ ఓడిపోయిన భారత్ ముందరి బాట అంత సులభంగా ఏమీ లేదు. రేపు చెన్నై వేదికగా జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ భారత్‌కు చావో రేవో లాంటిది. ఆ తర్వాత మార్చి ఒకటో తేదీన బలీయమైన వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఈ రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించడం భారత్‌కు అనివార్యం. లేనిపక్షంలో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం రవిశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: