हिन्दी | Epaper

Telangana Elections: జూన్ 2 తర్వాతే MPTC, ZPTC పోలింగ్?

Tejaswini Y
Telangana Elections: జూన్ 2 తర్వాతే MPTC, ZPTC పోలింగ్?

Telangana Elections : బీసీలకు 42 శాతం బీసీలకు కేటాయిస్తామన్న రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చిన తర్వాతే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో అధికారిక ఎజెండా ముగిసిన తర్వాత అధికారులు బయటకు వెళ్లిన తర్వాత పరిషత్ ఎన్నికలతో పాటు మరికొన్ని రాజకీయ అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానాన్ని, బిల్లును కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని, అప్పటి వరకు జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించొద్దనే అభిప్రాయానికి సిఎం రేవంత్ వచ్చినట్లు తెలుస్తోంది.

Keralam State Name Change: కేరళ పేరును ‘కేరళమ్‌’ మార్పుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Telangana Elections: MPTC, ZPTC polling after June 2?
Telangana Elections: MPTC, ZPTC polling after June 2?

ఈ విషయంపై రాష్ట్ర మంత్రులు, ఇతర నాయకులు సీఎం మాటలకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికల్లోనూ అదే జోరు, ఉత్సాహాన్ని కొనసాగించేలా మంత్రులంతా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బిల్లులు ఆమోదం పొందినప్పటికీ ఈ బిల్లు చట్టరూపం దాల్చేందుకు రాష్ట్రపతికి చేరింది. బీసీలకు విద్య, ఉద్యోగ, ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనేదే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. అయితే దీనికి రాష్ట్రపతి ఇంకా ఆమోదముద్ర వేయలేదు.

రాష్ట్ర ప్రభుత్వం దీనిని అమలు చేసేందుకు ప్రయత్నించినా హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఈ ప్రక్రియ మరింత కష్టంగా మారింది. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస పార్టీ సత్తా చాటింది. 93 మేయర్, చైర్మన్ స్థానాలను కాంగ్రెస్(congress) కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ 18 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే బీజేపీ ఒక మేయర్, ఒక చైర్మన్ స్థానంలో విజయం సాధించింది. మరో 5చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. ఈ రకంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ తన బలాన్ని నిరూపించేందుకు అడుగులు వేస్తోంది. కాగా, కేంద్రంలో రిజర్వేషన్లు అంశం తేలేందుకు మరింత సమయం పట్టేలా ఉంది. దీంతో జెడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికలు జూన్ 2 తర్వాతే
ఉండవచ్చునని అంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మార్చి 3 నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్ 2) వరకు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని చర్చించినట్లు తెలిసింది. ప్రతి ప్రభుత్వ శాఖలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నివేదిక తయారు చేయాలని సూచించినట్లు తెలిసింది. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా ఈ కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు పార్టీ వర్గాల సమాచారం. సీఎస్ రామకృష్ణారావు దీనిపై వివరాలను మంత్రివర్గానికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నివేదికలను పరిశీలించి ఎలాంటి కార్యక్రమాలను ఏ రకంగా చేపట్టాలో అధ్యయనం చేయాలని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధరాబాబు, పొంగులేటి
శ్రీనివాస్ రెడ్డిలతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రానున్న మంత్రివర్గ సమావేశానికి ఈ ఉపసంఘం నివేదికను తయారు చేసి ఇవ్వాలని సూచించనట్లు తెలిసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870