PM Modi Israel Visit: అంతర్జాతీయ దౌత్య ముఖచిత్రంపై భారత్, ఇజ్రాయెల్‌ల మధ్య సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2017 తర్వాత ఆయన చేస్తున్న రెండో పర్యటన కావడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం, మీడియా అపూర్వ ఏర్పాట్లు చేశాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన పత్రిక ‘ద జెరూసలేం పోస్ట్’ ప్రధాని మోదీ గౌరవార్థం తన ఫ్రంట్ పేజీని ప్రత్యేకంగా డిజైన్ చేసి భారత్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంది.
Read Also: Israel Visit: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య మోదీ కీలక విదేశీ పర్యటనకు బయలుదేరారు
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ‘స్పెషల్ కవర్ పేజీ’
పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ జ్వికా క్లెయిన్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఈ స్పెషల్ కవర్ పేజీని షేర్ చేశారు. ప్రధాని మోదీ అభివాదం చేస్తున్న ఫోటోతో పాటు ‘‘వెల్కమ్ మోదీ’’, ‘‘నమస్తే’’ అంటూ హెడ్డింగ్స్ ఇచ్చారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య బలపడుతున్న మైత్రికి ఇది నిదర్శనమని పత్రిక పేర్కొంది. ఈ పర్యటనలో మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్ ‘నెసెట్’ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించబోతున్నారు.
ప్రధాని నెతన్యాహుతో కలిసి మోదీ రక్షణ, భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, మరియు గాజాలో తాజా పరిస్థితులపై చర్చలు జరపనున్నారు. అలాగే ఇజ్రాయెల్ లోని హోలోకాస్ట్ మెమోరియల్ ‘యాద్ వాషెమ్’ను కూడా సందర్శిస్తారు. పర్యటన షెడ్యూల్ (భారత కాలమానం).. మధ్యాహ్నం 4:00 గంటలకు మోదీ ఇజ్రాయెల్ లో అడుగుపెడతారు. సాయంత్రం నెసెట్ లో ప్రసంగిస్తారు. రేపు ఉదయం ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో భేటీ, కీలక ఒప్పందాలపై ప్రధాని మోదీ సంతకాలు చేస్తారు.
ఈ పర్యటన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో చర్చలు జరుపుతామని ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ లో పేర్కొన్నారు. రక్షణ, వ్యవసాయం, సాంకేతికత, ఆవిష్కరణ, సైబర్ భద్రత, వాణిజ్యం వంటి వివిధ రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే మార్గాలను ఇరుపక్షాలు చర్చిస్తాయి. అలాగే, ప్రధాన మంత్రి మోదీ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ను కూడా కలుస్తారు. ఈ సమావేశం రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి రాజకీయ విశ్వాసం, భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఒక అవకాశంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: