हिन्दी | Epaper

US: అమెరికాలోని న్యూ బ్రున్స్‌విక్‌ నగరంలో ఏఐ డాటా సెంటర్‌ ఏర్పాటు రద్దు

Vanipushpa
US: అమెరికాలోని న్యూ బ్రున్స్‌విక్‌ నగరంలో ఏఐ డాటా సెంటర్‌ ఏర్పాటు రద్దు

అమెరికాలోని న్యూ బ్రున్స్‌విక్‌ (New Brunswick) నగరం ఏఐ డాటా సెంటర్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నది. సహజ వనరులను యథేచ్ఛగా తోడివేసే ఈ సెంటర్‌లకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. వాటితో ఎంతో ప్రమాదం ఉన్నప్పటికీ.. మన దేశం ఏఐ డాటా సెంటర్ల కోసం వెంపర్లాడుతున్నది. ఇదే అదనుగా గూగుల్‌ వంటి కంపెనీలు భారత్‌లో డాటా సెంటర్ల ఏర్పాటకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఆ కంపెనీల ప్రధాన కేంద్రమైన అమెరికాలో మాత్రం ప్రజానీకం తలుపులు మూసేస్తున్నారు. అత్యధిక మొత్తంలో నీటిని, విద్యుచ్ఛక్తిని వాడే ఏఐ డాటా సెంటర్ల ఏర్పాటుపై ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. మాకొద్దీ డాటా సెంటర్లు అంటూ ఎలుగెత్తి నినదిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నంలో ఏఐ సెంటర్‌ ఏర్పాటుకు గూగుల్‌ ముందుకు వచ్చిన సందర్భాన్ని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంది.

Iran vs usa tensions : ఇరాన్ వ్యూహాలు vs అమెరికా శక్తి, యుద్ధం ఎలా మారుతుంది?

US: AI data center construction canceled in New Brunswick, USA
US: AI data center construction canceled in New Brunswick, USA

కౌన్సిల్‌ నిర్ణయం పట్ల నగరవ్యాప్తంగా హర్షాతిరేకాలు

కానీ.. అమెరికాలోని న్యూ జెర్సీ రాష్ట్రంలోని న్యూ బ్రున్స్‌విక్‌ నగర కౌన్సిల్‌.. ప్రజల ఒత్తిడితో తమ ప్రాంతంలో ఏఐ డాటా సెంటర్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 19, 2026న ఏకంగా తీర్మానం చేసింది. ఇప్పటికే ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ.. ఆ ప్రాంతాన్ని పార్క్‌ అవసరాలకు వినియోగించుకునేలా సవరణలు చేసింది. కౌన్సిల్‌ నిర్ణయం పట్ల నగరవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నివాసాలు, వ్యాపార కేంద్రాలకు సమీపంలో 27వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డాటా సెంటర్‌ ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని నగర అధికారులు ప్రకటించిన తొమ్మిది రోజుల్లోనే కౌన్సిల్‌ తన నిర్ణయాన్ని రద్దు చేసుకోవడం విశేషం. తద్వారా డాటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సమూహాల్లో న్యూ బ్రున్స్‌విక్‌ నగరం కూడా చేరింది. ప్రభుత్వ నిర్ణయంపై ఫుడ్‌ అండ్‌ వాటర్‌ వాచ్‌ సెంట్రల్‌ న్యూ జెర్సీ సీనియర్‌ ఆర్గనైజర్‌ చార్లీ క్రటోవిల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల సహకారంలేకుండా ఈ విజయం సాధ్యమయ్యేదే కాదని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870