POCSO case: తమిళనాడులోని శివగంగ పోక్సో కోర్టు తీవ్ర సంచలనం కలిగించే తీర్పును వెలువరించింది. ఇద్దరు అప్రాప్త బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన జ్యోతిషుడు రామకృష్ణన్‌కు 200 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది.
Read Also: YouTuber Komali Suicide: యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

కోర్టు ఉత్తర్వుల ప్రకారం, బాధితులైన ప్రతి బాలికకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన 2021లో చోటుచేసుకుంది. 14, 17 ఏళ్ల వయస్సున్న తన కూతుళ్లు చదువులో వెనుకబడుతున్నారని భావించిన తల్లి వారిని జ్యోతిషుడి వద్దకు తీసుకెళ్లింది. పరిస్థితిని దుర్వినియోగం చేసుకున్న రామకృష్ణన్, ‘పరిహారం’ పేరుతో బాలికలపై ఘోర అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: