Munna re-release : రెబల్ స్టార్ Prabhas అభిమానులకు గుడ్ న్యూస్! 2007లో విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ Munna మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ చిత్రాన్ని మార్చి 6న 4K క్వాలిటీలో రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయన కెరీర్లో తొలి సినిమా. కమర్షియల్‌గా భారీ విజయం సాధించకపోయినా ప్రభాస్ స్టైల్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుని చిత్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.
Read also: IPS Sunil Kumar Nayak: ఏపీ పోలీసుల తీరుపై పట్నా హైకోర్టు ఫైర్
ఈ సినిమాలో ప్రభాస్ సరసన Ileana D’Cruz హీరోయిన్గా (Munna re-release) నటించారు. ఆమె అందం, నటన అప్పట్లో మంచి స్పందన పొందింది. ప్రతినాయకుడిగా Prakash Raj ప్రభావవంతమైన పాత్రలో కనిపించగా, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్ కీలక పాత్రలు పోషించారు.
సంగీతాన్ని Harris Jayaraj అందించగా పాటలు అప్పట్లో మంచి ప్రజాదరణ పొందాయి. ప్రముఖ నిర్మాత Dil Raju శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రస్తుతం పాత హిట్ సినిమాలను మళ్లీ విడుదల చేసే ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ‘మున్నా’ రీ రిలీజ్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. పెద్ద తెరపై ప్రభాస్ యాక్షన్‌ను మరోసారి చూసేందుకు ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: