हिन्दी | Epaper

Harish Rao: జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరించింది

Saritha
Harish Rao: జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరించింది

Harish Rao: మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత టి. హరీశ్ రావు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని, కనీసం వారిని చూస్తేనే విసుక్కునే స్థాయికి పాలకులు చేరుకున్నారని ఆరోపించారు. వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Read also: Spinal Muscular Atrophy: SMA వ్యాధి బాధితులు ఎంత మంది?  చికిత్స ఎక్కడ?

Harish Rao: జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరించింది
Harish Rao: The government has ignored journalists

రెండు బడ్జెట్లలో జర్నలిస్టులకు నిధులు కేటాయించలేదని విమర్శ

తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ తెచ్చామని, జర్నలిస్టులకు పూర్తి ఉచితంగా సేవలు అందించామని గుర్తుచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు బడ్జెట్లలో జర్నలిస్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ప్రశ్నించారు.

రెండున్నరేళ్లలో ఒక్కరికైనా కొత్త అక్రిడిటేషన్‌ కార్డు ఇచ్చారా? అని ప్రభుత్వంపై హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఎటువంటి కఠిన నిబంధనలు లేకుండా, అర్హులైన జర్నలిస్టులందరికీ తక్షణమే కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే హెల్త్ స్కీమ్ తరహాలోనే జర్నలిస్టులకు కూడా ఉచిత వైద్య సేవలు అందించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసినట్లుగా, జర్నలిస్టుల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్‌కు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. లేదంటే జర్నలిస్టుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870