हिन्दी | Epaper

Hussain Sagar: శభాష్ పోలీసులు.. తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడిన వైనం

Saritha
Hussain Sagar: శభాష్ పోలీసులు.. తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడిన వైనం

Hussain Sagar: హైదరాబాద్‌లోని (Hyderabad) ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ట్యాంక్‌బండ్‌పై ఒక విషాదకర ఘటన వెలుగు చూసింది. కుటుంబ సమస్యలతో విసిగిపోయిన ఒక మహిళ తన ఇద్దరు చిన్నారి కుమారులతో కలిసి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, గస్తీలో ఉన్న పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Read also: Amberpet Crime: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య!

Hussain Sagar: శభాష్ పోలీసులు.. తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడిన వైనం
Hussain Sagar: Well done police.. for saving the lives of the mother and children

జియాగూడ ఎంసీహెచ్ కాలనీకి చెందిన బి. ప్రతివ (28) అనే మహిళకు తన భర్తతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె, తన కుమారులు అనిష్ (10), జస్వంత్ (7)లను తీసుకుని ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. తెలంగాణ అమరవీరుల స్థూపం సమీపంలో వారు అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని అక్కడి పోలీసులు గమనించారు.

విచారణలో, కుటుంబంలో భర్తతో తరచూ గొడవలు జరుగుతున్నాయని, దీంతో విసిగిపోయి పిల్లలతో కలిసి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది. పరిస్థితి తీవ్రతను గమనించిన పోలీసులు వెంటనే వారిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ ఎ. సీతయ్య ఆమెకు ధైర్యం చెప్పి, ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని కౌన్సెలింగ్ ఇచ్చారు. తదుపరి చర్యల నిమిత్తం వారిని కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ముగ్గురి ప్రాణాలు నిలిచాయి. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ పై రష్యా దర్యాప్తు

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ పై రష్యా దర్యాప్తు

గాంధీ విగ్రహంపై తుషార్ గాంధీ అభ్యంతరం

గాంధీ విగ్రహంపై తుషార్ గాంధీ అభ్యంతరం

కాటేస్తున్న కల్తీపాలు

కాటేస్తున్న కల్తీపాలు

చిన్నారి పునర్విక కి పెరుగుతున్న ఆదరణ.. ప్రభుత్వం పై నెటిజన్ల ఒత్తిడి

చిన్నారి పునర్విక కి పెరుగుతున్న ఆదరణ.. ప్రభుత్వం పై నెటిజన్ల ఒత్తిడి

హెరిటేజ్‌పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు

హెరిటేజ్‌పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు

తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం

తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం

కాఫీ ఎక్కువగా తాగుతున్నారా ఐతే ఇది తెలుసుకోండి..

కాఫీ ఎక్కువగా తాగుతున్నారా ఐతే ఇది తెలుసుకోండి..

‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో దేశవ్యాప్త సైబర్ ముఠా అరెస్ట్

‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో దేశవ్యాప్త సైబర్ ముఠా అరెస్ట్

భారీ వర్షాల సూచన.. 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్

భారీ వర్షాల సూచన.. 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్

AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

టీజర్ ఉపసంహరణ: మేకర్స్ కీలక ప్రకటన

టీజర్ ఉపసంహరణ: మేకర్స్ కీలక ప్రకటన

ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు లేదా చెరకు రసం ఏది మంచిది?

ఎండాకాలంలో కొబ్బరి నీళ్లు లేదా చెరకు రసం ఏది మంచిది?

📢 For Advertisement Booking: 98481 12870